‘సైరా’ సెన్సేషన్స్ స్టార్ట్స్..!

‘బాహుబలి’ చిత్రం చారిత్రక చిత్రం వంటి కల్పిత గాధ. దాని విషయంలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. కానీ అదే తెలుగు తొలి స్వాతంత్య్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం నిజమైన బయోపిక్‌. ఈ చిత్రాన్ని ‘బాహుబలి’కి ధీటుగా తీసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీయాలని చిరు, చరణ్‌, సురేందర్‌రెడ్డిలు భావిస్తున్నారు. ఈ చిత్రం మోషన్‌ టైటిల్‌ పోస్టర్‌ ‘సై..రా..నరసింహారెడ్డి’ విడుదల చేసి చాలా కాలం అయిది. చిరంజీవి బర్త్‌డే రోజున ఇది జరిగింది. ఇక ఈ చిత్రం ప్రీప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. 

ఇందులో చిరుతో పాటు అమితాబ్‌బచ్చన్‌, నయనతార, సుదీప్‌, విజయ్‌సేతుపతి వంటి భారీ తారాగణం నటిస్తుండటం, వీరందరి డేట్స్‌ని తమకు అనువుగా మార్చుకోవడం చాలా కష్టమైన పనేనని చెప్పాలి. ఇక ఏఆర్‌రెహ్మాన్‌ వంటి సాంకేతిక నిపుణులు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ చిత్రం షూటింగ్‌ మరో నెల తర్వాత అంటే డిసెంబర్‌ ప్రధమార్ధంలో మొదలుపెడుతారని అంటున్నారు. 

ఇక ఈ చిత్రంలో బ్రిటిష్‌ వారిని తరిమి కొట్టిన ధీరుడు ఉయ్యాలవాడ కావడంతో రియలస్టిక్‌గా ఉండేందుకు హాలీవుడ్‌ నుంచి జూనియర్‌ ఆర్టిస్టులను కూడా వందల సంఖ్యలో దిగుమతి చేసుకుంటున్నారు. ఇక చిరు బరువు తగ్గి తన గెటప్‌పై కుస్తీలు పడుతున్నాడు. బరువు తగ్గడం కోసం జిమ్‌ వర్కౌట్స్‌తో పాటు కేరళ వెయిట్‌ లాస్‌ ట్రీట్‌మెంట్‌ని కూడా తీసుకుంటున్నాడు. చరిత్ర కారులతో కలిసి తన గెటప్‌, కాస్ట్యూమ్స్‌, బాడీలాంగ్వేజ్‌ వంటివి తీర్చిదిద్దుకుంటున్నాడు. యుద్ద విద్యలు, గుర్రపుస్వారీ, కత్తి యుద్దాల వంటివి ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. 

ఇక ఈ చిత్రానికి రత్నవేల్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం ‘రంగస్థలం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం నవంబర్‌ చివరకు షూటింగ్‌ పూర్తి చేసుకుంటుందని, వెంటనే రత్నవేలు ఈ చిత్రంలో జాయిన్‌ అవుతాడని అంటున్నారు. మరి చిరంజీవి స్టామినా ఈ చిత్రం ద్వారా ఎంత అనేది నిరూపితం కానుంది.

Source From: http://www.cinejosh.com/rss-feed/0/telugu.html

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *