సాయి ధరమ్.. మార్పులు మొదలెట్టాడు!!

సాయి ధరమ్ కి అర్జెంట్ గా ఒక సూపర్ డూపర్ మాస్ మసాలా హిట్ కావాలని మాస్ దర్శకుడు వి వి వినాయక్ తో కలిసి ఇంటిలిజెంట్ సినిమా చేసాడు. ఆ సినిమా ఫలితం ఏమిటో గత శుక్రవారమే ప్రేక్షకులు తీర్పు ఇచ్చేసారు. ఆ సినిమా సాయి ధరం అనుకున్న రేంజ్ విజయం దక్కకపోయినా కనీసం యావరేజ్ టాక్ తెచ్చుకోలేక డిజాస్టర్ అయ్యింది. ధర్మ భాయ్ గా సాయి ధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ సినిమాలో ఏ మాత్రం మెప్పించలేకపోవడమే కాదు… చిరంజీవిని అనుకరిస్తూ సాయి నటన మెగా ఫాన్స్ కే మొహంమొత్తేలా చేసింది. ఇంటిలిజెంట్ ఫైట్స్  విషయంలోనూ అలాగే డాన్స్ ల విషయంలోనూ సాయి ధరమ్ పెద్ద మేనమావ చిరంజీవిని అనుకరించడంతో అందరు విమర్శించారు. మంచి టాలెంట్ పెట్టుకుని ఇలా మేనమామలను అనుకరించడం ఏమిటంటూ విమర్శించారు.

అయితే ఈ ఇంటిలిజెంట్ డిజాస్టర్ దెబ్బకి సాయి ధరమ్ తేజ్ కాస్త రియలైజ్ అయ్యాడనిపిస్తుంది… ఈ న్యూస్ వింటుంటే. అదేమిటంటే సాయి ధరమ్ తేజ్ తన తదుపరి సినిమాల కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అందులో భాగంగానే తాను మాస్ ని పక్కన పెట్టి క్లాస్ లుక్ లోకి మారాలనుకుంటున్నాడట. అందుకే కరుణాకరన్ తో సాయి చెయ్యబోయే సినిమాలో చాలానే మార్పులు స్టార్ట్ చేశారట. ఈ సినిమాలో మాస్ అంశాలు తగ్గించి యూత్ కి అలాగే ప్రేమకు సంబంధించిన అంశాలను పెంచుతున్నారట. 

కేవలం ఈ సినిమా మాత్రమే కాకుండా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో  సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో కూడా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ ని తగ్గించి యూత్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారట.  అలాగే సాయి ధరమ్ తన తదుపరి సినిమాల్లో కామెడీకి పెద్ద పీట వెయ్యాలని కూడా డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి.

Source From: http://www.cinejosh.com/rss-feed/0/telugu.html

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *