షాకింగ్: ప్రియా ప్రకాష్ ను ఇంట్లో నుంచి పంపించేసి తల్లి!!

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

ఒక అమ్మాయి కన్ను కొట్టింది… ఒక్కళ్లో, ఇద్దరో కాదంటే ఓ పది మంది పడిపోయారంటే ఇయ్యాల్టి తరంలో అది కామన్ లే అనుకోవచ్చు. కాని ఈ అమ్మాయి దేశం మొత్తాన్ని పడగొట్టిందే… జస్ట్ ఓ పది సెకన్ల పాటు కన్ను గీటింది అంతే….. అసలే వాలెంటైన్స్ డే మూడ్ లోకి వెళ్లిపోయిన యంగ్ జనరేషన్ కళ్లల్లోకి, కలల్లోకి ఎక్కేసింది ఈ కేరళ కుట్టి. రెండు మూడు రోజుల నుంచి ప్రియా ప్రకాశ్ వారియర్ పేరును దేశం మొత్తం జపం చేస్తోంది. ప్రేమికుల రోజుకి ముందు డిఫరెంట్ స్టయిల్ లో ఐ బ్లింక్ చేసి ఎంతలా ఆకట్టుకుందంటే అల్లు అర్జున్ వంటి గ్లామరస్ హీరో సైతం చూపు తిప్పుకోలేకపోయానని చెప్పకుండా ఉండలేకపోయాడు. 

కేవలం 20 సెకన్లలో తన హావభావాలతో నెటిజన్లను ఫిదా చేసిన ప్రియాకు ఇప్పుడో కష్టమొచ్చింది. సెలబ్రెటీ రానంత వరకూ ఎవరూ పట్టించుకోరు… ఒక్కసారిగా.. పైగా ఈ రేంజ్‌లో సెలబ్రెటీ హోదా దక్కించుకుంటే మీడియా దృష్టంతా అలాంటి వాళ్ల పైనే ఉంటుంది. ఇప్పుడు ప్రియా ప్రకాష్ పరిస్థితి కూడా అదే.

Image result for priya prakash

ఈ రేంజ్‌లో క్రేజ్ రావడంతో ఆమె ఇంటర్వ్యూ కోసం మీడియా ప్రతినిధులు క్యూ కడుతున్నారు. ఆమె ఇంటి చుట్టూ కోలాహలం నెలకొంది. అయితే తమ కూతురికి పేరు రావడం మంచిదే అయినా మీడియా చేస్తున్న హడావుడితో ఒకింత ఇబ్బందిగా కూడా ఉందని ప్రియా తల్లి ప్రీతా తెలిపారు. తనకు మీడియా ప్రతినిధుల నుంచి ఫోన్లు వస్తున్నాయని, ప్రియా హాస్టల్‌కు వెళ్లిపోయిందని చెప్పినట్లు ఆమె వెల్లడించారు.

హాస్టల్‌కు ఎందుకు పంపించారని ప్రియా తల్లిని అడగ్గా.. ఉన్నట్టుండి వచ్చిన ఈ క్రేజ్‌తో తమ కూతురికి కొంత ఇబ్బందిగా కూడా ఉందని ఆమె చెప్పారు. అందుకే ఈ హడావుడి తగ్గేంత వరకూ హాస్టల్‌కు పంపినట్లు తెలిపారు. పైగా చిత్ర దర్శకుడు కూడా సినిమా విడుదలయ్యే దాకా ప్రియా ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని చెప్పినట్లు ఆమె తల్లి చెప్పారు. సినిమా కొంత మాత్రమే పూర్తయిందని, ఇంకా షూటింగ్ చేయాల్సింది చాలా ఉందని దర్శకుడు తమతో చెప్పాడని, ఈ తలనొప్పంతా ఎందుకని ప్రియాను హాస్టల్‌కు పంపినట్లు ఆమె తల్లి ప్రీతా తెలిపారు.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *