వైసీపీ రాజ్యసభ సీటుకు టీడీపీ చెక్‌

రాజ్యసభ సీటు అంటే దేశంలో వెరీవెరీ హాట్‌ సీటు అది. ఎందుకంటే ఎంపీగా గెలవాలంటే రూ.100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన దరిద్రపుగొట్టు రాజకీయం దేశంలో నడుస్తోంది. ఓ పార్టీ తరపున ఎంపీ టిక్కెట్‌ తెచ్చుకున్నవాడి నెత్తినే ఆ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సీట్ల ఖర్చు రుద్దుతున్నారు. పైగా గెలుస్తాడనే గ్యారంటీ లేదు. గెలిచినా లోక్‌సభ ఐదేళ్లు ఉంటుందనే భరోసా లేదు. అదే రాజ్యసభ అయితే కాళ్లు పుండ్లు పడేలా, శోష వచ్చేలా ప్రచారం చేయక్కర్లేదు. హాయిగా రాజ్యసభ సీటు పొందితే హాయిగా ఎంపీ అయిపోవచ్చు. పైగా ఆరేళ్లు గ్యారంటీ. అందుకే హేమాహేమీలు దానికి పోటీ పడతారు. ఇదీ నేపథ్యం.

డైరెక్టు పాయింట్‌లోకి వచ్చేద్దాం. మరో ఆరునెలల్లో ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఎంపీలు చిరంజీవి, రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్‌ల పదవీకాలం ముగుస్తోంది. వీరి స్థానంలో మరో ముగ్గురిని ఏపీ నుంచి రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. ఈ మూడు సీట్లను కైవసం చేసుకునేందుకు టీడీపీ భీభత్సమైన ప్రణాళికతో సిద్ధంగా ఉంది. రాజ్యసభ సీటు గెల‌వాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవ‌స‌రం.
వైసీపీ నుంచి 67 మంది గెలవగా 21మంది టీడీపీలో చేరగా ప్రస్తుతం వైసీపీ చేతిలో 46 మంది ఎమ్మెల్యేలున్నారు. దీంతో వారికి ఒక రాజ్యసభ సీటు ఖాయంగా దక్కాలి. అయితే ప్రభుత్వంపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న జగన్‌కి, ఆ పార్టీ నాయకులకు టీడీపీ షాక్ ట్రీట్‌మెంటు ఇవ్వాలని అనుకుంటోందట.

వైసీపీలోని ఆరుగురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం ఉండదు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఒక కాలు గీత బయటపెట్టి సిద్ధంగా ఉన్నారు. జస్ట్‌ అక్కడి నుంచి గ్రీన్‌ ఫ్లాగ్‌ ఒక్కసారి ఊపగానే మారథాన్‌ చేయటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఈ లెక్కన వైసీపీకి వచ్చే రాజ్యసభ సీటు కూడా పాయే..

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *