వైఎస్‌ సీఎంగా ఉన్న రోజుల్లో కార్పోరేట్లను ఇలా చేసేవాడు “సాక్షి” అక్రమ పుట్టుక అలాగే జగన్‌, విజయసాయి బతుకిదే

అది హైదరాబాద్‌లో దక్షిణ భారత మిల్లు యజమానుల సంఘం సమావేశం. పెట్టుబడులతో రండి అంటూ వైఎస్‌ ఘనంగా పిలుపునిచ్చారు. పాపం..లోగుట్టు కన్నన్‌కేం తెలుసు? సిమెంట్‌ పరిశ్రమ పెడతానంటూ ముందుకు వచ్చారు. ఆయన విజిటింగ్‌ కార్డు వైఎస్‌ తీసుకున్నారు. అంతే చేప దొరికింది. కన్నన్‌ జయలక్ష్మీ టెక్స్‌ టైల్స్ అధినేత. కర్నూలు జిల్లాలో జయజ్యోతి సిమెంట్స్‌ పెట్టేందుకు లైసెన్సులు వంటి వన్నీ సమకూర్చుకున్నారు. ఇంతలో ఆడిటర్ విజయసాయిరెడ్డి సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. జగన్‌ కంపెనీకి కన్నన్‌ని పెట్టుబడులు సమర్పించుకోండి అని చెప్పారు. దానికి కన్నన్‌ నాకు మీ పత్రిక, టీవీ (సాక్షి)లో పెట్టుబడులు పెట్టే ఉద్దేశం లేదు. నాది సిమెంట్‌ వ్యాపారం. మీడియాపై నాకు అవగాహన, ఆసక్తి లేవు. దానితో ఏ రకమైన సంబంధం లేని ఫీల్డ్‌ నేను పెట్టను అన్నాడు కన్నన్‌.

దానికి విజయసాయిరెడ్డి రాష్ట్రంలో ఏ ఇబ్బందీ లేకుండా వ్యాపారం చేసుకోవాలని ఉందా? లేదా మీకు అన్నాడు. బిత్తరపోయిన కన్నన్‌ అదేంటి నా సిమెంట్‌ పరిశ్రమకు సంబంధించి అన్నీ డాక్యుమెంట్లు నిబంధనల ప్రకారమే ఉన్నాయి కదా అన్నాడు. ఇవన్నీ కాదు ఏపీలో వ్యాపారం చేయాలి అంటే సీఎం తనయుడు జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాల్సిందే అని విజయసాయి బెదిరింపులకు దిగాడు. దాంతో భయపడిపోయిన తమిళనాడు వ్యాపారి కన్నన్‌ జగతి పబ్లికేషన్స్‌ (సాక్షి పత్రిక)కు రూ.5 కోట్లు ముట్ట చెప్పారు. అది బయట ప్రపంచానికి వివిధ వ్యాపారాలు చేసే వాళ్లు సాక్షిలో పెట్టుబడులు పెట్టారు అని చెబుతారు. నిజం ఏమిటంటే అవి వసూళ్లు. ఇష్టమై పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌ కాదు. పైగా ఇక్కడ వాళ్లు పెట్టిన వాటికి రిటర్న్స్‌ కూడా ఇవ్వరు. లంచంను ఇలా పరోక్షంగా స్వీకరిస్తారు. ఎవరన్నా లంచం డబ్బును తమ అక్కౌంట్‌లో వేయమంటారు. వైఎస్‌, జగన్‌, విజయసాయి స్టయిల్‌ ఏంటంటే తమ కంపెనీలో వేయమంటారు.

వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు కార్పోరేట్లను ఇలాగే డీల్ చేసేవాడు. అలాంటి చీకటి పనులకు ఎవరన్నా కక్కుర్తి పడి సహకరిస్తే సత్యం రామలింగరాజులా జైలుకు పోవాల్సి ఉంటుంది. అయినా సిగ్గులేకుండా సీఎం హోదాలో ఉంటూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలిచి వచ్చిన వాళ్లను కొడుకు కంపెనీలో పెట్టమనటం కాదూ కూడదంటే బెదిరించటం ఇదే రాజన్న రాజ్యం. ఇలాంటి బాగోతాలు అన్నీ సీబీఐ విచారణలో చెప్పుకుని అనేక మంది పారిశ్రామిక వేత్తలు గొల్లు మన్నారు. ఈ సాక్ష్యాధారాలు చూసే కోర్టు జగన్‌ని జైలుకు పంపించింది. ఆ విధంగా సాక్షి పత్రిక అక్రమ పెట్టుబడులకు పుట్టిన అక్రమ సంతానం. అధికారం మాటున సాగిన అరాచకానికి జన్మించిందే సాక్షి. ఇది కేవలం కన్నన్‌ అనే కార్పోరేట్‌ విషయంలో జరిగిన దగా. ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి.

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *