వర్మ.. ‘పులి’ అంటూ మరింత రెచ్చగొట్టాడు!

పొగిడితే విపరీతంగా పొగడటం, తేడా వస్తే తాట తీసే రకాలలో వర్మ కూడా ఒకరు. అసలే పవన్‌ అభిమానులు కూడా ఈ చిత్రం విషయంలో పెదవి విరుస్తున్నారు. ఇక ఈచిత్రం ఫస్ట్‌లుక్స్‌, టీజర్‌, ట్రైలర్‌ సందర్భంగా పాజిటివ్‌గా స్పందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఈ చిత్రం తాజాగా చూశాడు. దీంతో ఆయన ట్వీట్‌ చేస్తూ ఇప్పుడే కత్తి మహేష్‌ ఇచ్చిన రివ్యూని చూశాను. చాలా బాగా ఉంది. పవన్‌కళ్యాణ్‌ కంటే కత్తి మహేషే అందంగా ఉంటాడని తెలిపాడు. దీంతో ఇటు సినిమాపై విమర్శలు, మరోవైపు రివ్యూలు, మరో వైపు ప్రేక్షకుల పెదవి విరుపు.. వీటితో సతమతవుతున్న పవన్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు కత్తి మహేష్‌తో పాటు ఆర్జీవీపై కూడా నిప్పులు చెరుగుతున్నారు.

ఇక ఆర్జీవీ, కత్తిమహేష్‌లపై హైపర్‌ ఆది కౌంటర్‌ ఇచ్చాడు. వీరిద్దరి వ్యవహారం చూస్తుంటే.. ‘ఇదిగో తెల్లకాకి అంటే.. అదుగో కాకి పిల్ల’ అన్నట్లుగా వీరిద్దరి వ్యవహారం ఉందని అంటున్నాడు. మరోవైపు వర్మ పెట్టిన మరో ట్వీట్‌ పవన్‌ ఫ్యాన్స్‌కి మింగుడు పడటం లేదు. ఆయన గతంలో పవన్‌ డిజాస్టర్‌ చిత్రమైన ‘కొమరం పులి’ అలియాస్‌ ‘పులి’ని ఈ చిత్రాన్ని పోలుస్తూ పెట్టిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ‘ఇప్పుడే ఓ పులిని చూశాను. కాకపోతే గోళ్లు లేని, పంజాలేని పులిని ఇప్పటివరకు చూడలేదు. మొదటిసారి చూశాను. అయినా పులి చారలు ఎలా మార్చుకుందో అర్ధం కావడం లేదు. ఈ విషయం తెలియక చాలా ఆశ్యర్యానికి లోనవుతున్నాను. అన్నిటి కన్నా దూకాల్సిన పులి పాకుతుండటం షాకింగ్‌గా ఉంది’ అంటూనే వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.

ఇక వర్మకి కత్తి మహేష్‌ థాంక్యూ కూడా చెప్పాడు. మొత్తానికి ఈ చిత్రం డిజాస్టర్‌ అని తేలడంతో కలెక్షన్లలో పులిని, పంజాలను దాటుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది…! అయినా హైపర్‌ ఆదితో పాటు పవన్‌ వీరాభిమనాలు ఈచిత్రం బాగుందని అని అంటే అది వారి అవివేకమనే చెప్పాలి. సినిమా చూడటం కూడా చేతకాని హైపర్‌ ఆది అనవసరంగా అడ్డంగా బుక్కయ్యాడు.

Source From: http://www.cinejosh.com/rss-feed/0/telugu.html

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *