లగడపాటి సీఎంకు ఎన్ని సీట్లు గెలుస్తారని చెప్పాడో తెలుసా?

మరో 15 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళితే గ్రౌండ్‌ రియాలిటీ ఎలా ఉండబోతోందో కనుక్కునే పని లగడపాటికి అప్పచెప్పారని అంటున్నారు రాజగోపాల్ అనుచరులు. హడావుడిగా ఇంటింటికీ తెలుగుదేశం పెట్టడానికి కారణం కూడా ఎన్నికలకు సన్నద్ధం అవటమేనని సమాచారం. నంద్యాల ప్రచారం సమయంలో టీడీపీకి 47శాతం ఉన్న ఓటింగ్‌ శాతం పోలింగ్‌ నాటికి 56శాతానికి చేరుకుంది. నంద్యాల, కాకినాడ ఫలితాల తర్వాత ప్రస్తుతం తెలుగుదేశంకు 60శాతం ఓటర్లు అనుకూలంగా ఉన్నారని లగడపాటి సీఎంకు చెప్పినట్టు సమాచారం.

ఇంకా పబ్లిక్‌ పల్స్ రాష్ట్రమంతటా కనుక్కుంటునే పనిలో రాజగోపాల్‌ టీమ్‌ ఉంది. సీఎంను కలిసినప్పుడు చెప్పిన రఫ్‌ కేలిక్యులేషన్‌ ప్రకారం టీడీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 125 సీట్లు వస్తాయని చెప్పినట్టు తెలుస్తోంది. 2009 ఎన్నికలకు వెళ్లేముందు ప్రజారాజ్యం ప్రభావం మహాకూటమిపై ఏ మేరకు ఉంటుంది అనేది రాజగోపాల్‌ సర్వే చేసి వైఎస్‌కు నివేదిక ఇచ్చిన మీదటే రాజశేఖర్‌రెడ్డి తనదే గెలిపించే బాధ్యత అని చెప్పిన విషయం తెలిసింది. ప్రజారాజ్యం వల్ల మహాకూటమి దెబ్బతింటుందని కూడా రాజగోపాల్‌ ముందే వైఎస్‌కి చెప్పాడు.

ఈసారి జనసేన ప్రభావం అధికార టీడీపీపై ఎలా ఉంటుందో కనుక్కునే పనిలో లగడపాటి టీమ్‌ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ప్రజల నుంచి టెలిఫోన్‌ సర్వేలోనూ 60శాతం జనం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దానిని 80శాతానికి తీసుకువెళ్లే వ్యూహరచనలో చంద్రబాబు ఉన్నారు.

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *