రాజమౌళికి నో చెప్పాడా? యే…?

తెలుగులోనే కాదు ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు రాజమౌళి. అంతకు ముందు తీసిన సినిమాలు ఒక ఎత్తయితే, బాహుబలి సిరీస్ తో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేసిన రాజమౌళి అది మొదలయ్యే లోపు ఒక చిన్న సినిమా చేద్దాం అని అనుకున్నాడు. అఖిల్ తో సినిమా చేస్తానని నాగార్జునకి అప్పుడెప్పుడో మాట ఇచ్చిన జక్కన, ఈ మధ్య ఒక లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక స్టోరీ చెప్పాడట. నాగ్ ఒప్పుకుంటే సెప్టెంబర్ కల్లా సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తానన్నాడట. అయితే, నాగార్జునకి స్టోరీ అంత ఇంటరెస్టింగ్ గా అనిపించకపోవడం… సినిమా తక్కువ టైములో తీస్తే అవుట్ ఫుట్ ఎలా వస్తుందో అని భయపడి రాజమౌళి కి నో చెప్పాడట. అసలే రెండు ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉన్న అఖిల్ కి మంచి అవకాశం మిస్ అయిందంటున్నారు. ఇప్పడి వరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని జక్కన అంత ఈజీగా సినిమా చుట్టెయ్యడు. అవసరం అయితే ఎన్టీఆర్, చరణ్ సినిమాని ఇంకొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసేవాడు అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ, రాజమౌళి సినిమా చేసుంటే, అవుట్ ఫుట్ ఎలా ఉన్న హిట్ గ్యారంటీ ఉండేది, అది రాజమౌళి బ్రాండ్ వేల్యూ అంటే. అయితే, ఒక తెలుగు టాలెంటెడ్ డైరెక్టర్ మరియు అక్కినేని స్కూల్ లో డైరెక్టర్ పట్టా పుచ్చుకున్న యువకుడు రెండు డిఫరెంట్ స్టోరీలు చెప్పారట. ఈ రెండు కథలకి ఓకే చెప్పిన నాగ్, త్వరలో ఒక సినిమా మొదలు పెట్టి అది పూర్తవ్వగానే రెండవది సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట.

Source From: http://www.teluguone.com/tmdb/rss_tlnews.xml

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *