యాక్షన్‌ సీన్స్‌కి కొత్త రూపు ఇచ్చిందే ఈయన!

ఒకప్పుడు సినిమాలలో హీరోలు చేసే ఫైట్స్‌, యాక్షన్‌ సీన్స్‌ వంటివి చూస్తే ఏమాత్రం నేచురల్‌గా లేకుండా ఏదో అలా నటిస్తున్నారని అందరికీ అర్దమయ్యేది. ఇక చేజింగ్‌లు, గుర్రపుస్వారి వంటి విషయాలలో డూప్‌లతో చేయిస్తున్నారని అందరికి అర్ధమయ్యేది. కానీ పీటర్‌హెయిన్స్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా రావడంతో సినిమాలలోని మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ చిత్రాలలోని స్టంట్స్‌ తీరుతెన్నులే మారిపోయాయి. ఇక ఆయన తాజాగా మాట్లాడుతూ, నన్ను మా నాన్న చదివించలేదు. మార్షల్  ఆర్ట్స్‌ నేర్పించారు. ఇప్పుడదే నాకు తిండి పెడుతోంది. ఇక సినిమాలలో యాక్షన్‌సీన్స్‌, ఫైట్స్‌ అనేది కథలో భాగంగా ఉండాలి. ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప ఫైట్‌ సీన్‌ పెట్టకూడదు. కేవలం మాస్‌మసాలా కోసం ఫైట్స్‌ని పెట్టే సినిమాలను నేను ఒప్పుకోను. 

ఇక హాలీవుడ్‌ తరహాలో ఇండియన్‌ సినిమాలలో యాక్షన్స్‌ సీన్స్‌ రియాలిటీకి దగ్గరగా ఉండవని అంటుంటారు. ఎవరి భాష, అక్కడి ప్రేక్షకుల అభిరుచిని బట్టే ఏదైనా ఉంటుంది. హాలీవుడ్‌లో కూడా కొన్ని చెత్త సీన్స్‌ ఉంటాయి. మన ప్రేక్షకులకు థ్రిల్‌ అనిపించేలా యాక్షన్‌ సీన్స్‌ ఉండేలా చేసుకోవడమే నాకు ముఖ్యం. ఇక నేను రాజమౌళి గారితో ఎక్కువ చిత్రాలు చేశాను. త్రివిక్రమ్‌ గారితో కూడా. ఆయనతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆయన్ను నేను ‘డాడీ’ అని ఆత్మీయంగా సంబోధిస్తాను. ఇక సినిమాల విషయంలో అన్ని నా కన్నబిడ్డల వంటివే. యుద్ద సన్నివేశాలలో 1000 మంది ఫైటర్స్‌ ఉన్నా అన్ని నేనే చూసుకుని ప్రతి ఒక్కరికి నేనే వివరిస్తాను. గ్రూప్‌లుగా విభజించి, ఆసక్తి, ప్రతిభ ఆధారంగా వారెక్కడెక్కడ ఉండాలి..? ఏయో షాట్స్‌ తీయాలి అనేది చెబుతాను. షూటింగ్‌ సమయంలో నేను ఎంతో కఠినంగా ఉంటాను. ఒక్కోసారి అడవి మృగంగా ప్రవర్తిస్తుంటాను. ఇక నాకు పర్సనల్‌గా ఫ్యామిలీ అటాచ్‌మెంట్‌ ఉన్న చిత్రాలంటే ఇష్టం. నేను డైరెక్ట్‌ చేయబోయే చిత్రం కూడా అలాంటిదే. 

యాక్షన్‌ సీన్స్‌లో దెబ్బలు తగలడటం సహజమే. జాకీచాన్‌కి 52 సార్లు ఎముకలు విరిగాయి. నాకు 46 సార్లు విరిగాయి… అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈయన కూడా ఓవర్‌నైట్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ అయిపోలేదు. ముందుగా చిన్న చిన్న యాక్షన్స్‌ సీన్స్‌లో కనిపిస్తూ ఉండేవాడు. ఇక ‘అపరిచితుడు’తో ఆయన స్టంట్స్‌లోనే విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ని ఇటీవల తాను ‘గురుజీ’ అని పిలుస్తానని సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌ చెప్పాడు. ఇప్పుడు పీటర్‌ హెయిన్స్‌ తాను త్రివిక్రమ్‌ని ‘డాడీ’ అని పిలుస్తుంటానని చెబుతుంటాడు. ఇందరిని ప్రభావితం చేస్తూ, తాను మాత్రం సింపుల్‌గా ఉండే త్రివిక్రమ్‌ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. 

Source From: http://www.cinejosh.com/rss-feed/0/telugu.html

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *