మోడీ సాబ్‌ పండుగ పూట మమ్మల్ని ముష్టి ఎత్తుకునేలా చేయటం ధర్మమా?

అయ్యా ధర్మం, అమ్మా ధర్మం అంటూ పండుగ పూట మమ్మల్ని చేబదులు కోసం ముష్టి ఎత్తుకునేలా చేయటం ధర్మమా మోడీ సాబ్? మీరు ఏ ముహుర్తాన డీ మానిటైజేషన్‌ ప్రకటించారో గానీ అప్పటి నుంచీ ఏటీఎంలలో డబ్బులు ఉండట్లేదు. మా కష్టార్జిజం, మా సొమ్ము మీ దగ్గర పెట్టుకుంటే మా డబ్బులు మా అవసరానికి మాకు ఇవ్వటానికి ఇంతగా తప్పించుకుంటారా? మీ బాధ్యతల నుంచి తప్పించుకుంటారా? ఆర్‌బీఐని అడగాల్సిన ప్రశ్నలు మిమ్మల్ని ఎందుకు పబ్లిక్‌ అడుగుతున్నారంటే పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆర్‌బీఐ చేయాల్సిన పని మీరు చేశారు కాబట్టి.

అన్ని నగరాల్లో ఎటిఎం సెంటర్లు నిత్యం నగదు డ్రా చేసుకునేవారితో, డిపాజిట్‌ చేసేవారితో కళకళలాడుతుండేవి. కానీ ఈ మధ్య అత్యథిక ఏటీఎంలలో నగదు లేక వెలవెలబోతున్నాయి. సంక్రాంతి పండుగ వేళ చేతిలో చిల్లిగవ్వ లేక నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావటంతో పరిస్థితి మరీ క్లిష్టంగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి వందలాదిగా ప్రయాణీకులు తరలివస్తున్నారు. చేతిలో ఎటిఎం కార్డులు పెట్టుకుని నగదు కోసం ప్రతి ఎటిఎం సెంటర్ల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. ఒక్కో ఎటిఎంలో కొంత నగదును పెట్టినా కొద్దిసేపటికే అయిపోయింది. ఎటిఎం సెంటర్లలో నగదు లభ్యం కాకా ఇతర ఎటిఎం సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం ఉండటం లేదు. ప్రైవేట్‌ బ్యాంకుల ఎటిఎం సెంటర్లలలో కూడా నగదుకు కటకటలాడాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొన్ని ఎటిఎంల వద్ద క్యూలో నిలబడిన వారు ఉసూరు మంటూ వెనుదిరగాల్సి వచ్చింది. పెన్షన్‌దారులు పండుగకు నగదు డ్రా చేసేందుకు ఎటిఎం సెంటర్ల దగ్గరకు వెళ్లి నో క్యాష్‌ అని చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. దయచేసి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దండి మా డబ్బులు మా మొహాన పారేయండి. మమ్మల్ని వీధుల్లో కార్డులు పట్టుకుని డబ్బులు కోసం ముష్టెత్తుకునేలా చేయకండని వేడుకుంటున్నాము.


Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *