మోడీనీ, జగన్‌ని ఓ వాయి తీశాడు

బీజేపీనీ, మోడీని మొన్ననే ఉతికి ఆరేస్తే ఇంకా ఆ చిరుగులు అలాగే ఉండగా మరో వాయి వేశారు వాడీగా వేడీగా మన తాడిపత్రి టైగర్‌, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. ప్రధాని మోడీ తీరుపై జేసీ చేసిన కామెంట్లు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. జేసీ ఏమైనా కేజువల్ గా అంటారా అంటే కాదు ! ఢిల్లీని అక్కడి రాజకీయాన్నీ దగ్గరగా చూస్తున్న ఎంపీ ఆయన. చంద్రబాబు నాయుడు తన స్థాయిని తగ్గించుకుని మరీ పోలవరం కోసం మీ చుట్టూ తిరుగుతూ ఉంటే..మమ్మల్ని మీరు చిన్న చూపు చూస్తున్నారు..ఇది బిజేపి వాళ్ళ జాగీరు కాదు, మేము బిజేపికి బానిసలం కాదు అంటూ ఆ మధ్య చేసిన ఫైరింగ్‌కి పిట్టల్లా రాలిపోయారు బీజేపీ వాళ్లు.

మళ్లీ ఈరోజు ఇంకో రౌండ్‌ మాటల తూటాలు వదిలారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ప్రధాని మోదీకి ఈర్ష్యా, ద్వేషం ఉందని జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. అన్నీ ఇస్తే రాజకీయంగా ఎదుగుతారని భయం ఉండడంవల్లే హామీలు అమలు చేయడంలేదోమోనని ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు దమ్ముంటే ఇవాళే తమ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో ఏపీకి కొన్ని నిధులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముందు.. వెనుక ఆలోచన చేయకుండా జగన్ అనాలోచిత ప్రకటన చేస్తుంటారని అన్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇలాగే తన ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని ప్రకటించారని, ఆ మాట నిలబెట్టుకోలేదని జేసీ ఎద్దేవా చేశారు. జగన్ పాదయాత్ర చేసినా ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితి లేదని, ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి, ప్రజల ముందుకు రావాలి కాబట్టి మళ్లీ ఓ అసత్య ప్రకటన చేశారని అన్నారు. జగన్‌కు మాటమీద నిలబడే అలవాటు లేదని ఎద్దేవా చేశారు. ఆనాడు ఇచ్చిన మాటకు జగన్ ఎందుకు కట్టుబడి ఉండలేదని జేసీ ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు రాజీనామాలు చేయించినా ఉప ఎన్నికలు రావుకాబట్టి ఏదో ఒకటి చెప్పి ప్రజల్లో సానుభూతి పొందవచ్చునని.. చిత్త శుద్ధిలేని వ్యాఖ్యలు చేస్తున్నారని జేసీ మండిపడ్డారు. చంద్రబాబును తక్కువ అంచనా వేయోద్దని ఆయన అన్నారు. ఏపీ తో వైరం బిజేపి కి అంట మంచిది కాదని చివరకి..బిజేపి కి ఏపీలో ఎదురు దెబ్బ తగలడం ఖాయం అని తెలిపారు. జగన్ కి చేతకాదు అన్నాడు.

పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత అధికారం కాదు… పతనం, పాతాళమే వస్తాయ్ అన్నాడు. ఎంత సేపూ ఎప్పుడో పోయిన తండ్రి గురించి కాదు, ఇప్పటికైనా ఏపీ భవిష్యత్ మీద మాట్లాడమని సవాల్ చేశాడు. అన్నిటికీ మించి పల్నాడులో సీమకి నీళ్లు ఇస్తున్నారని గొడవ… సీమలో పల్నాడుకు ఇస్తున్నారని హడావుడి చేస్తున్నావ్ దమ్ముంటే నిజాలు మాట్లాడు అని కూడా సవాల్ విసిరారు జేసీ ! ఏపీ రాజకీయం వన్ సైడ్ అయిపోయి… విపక్షం కనీసం కౌంటర్ వేసుకోలేని పరిస్థితికి దిగజారిపోవడం నిజంగా బాధ అనిపిస్తోంది. లేకపోతే ఏంటి… జగన్ గ్రౌండ్ లో అవతల పార్టీ ఆడుకుంటోంది. గేలరీలో కూర్చున్న వైసీపీ నేతలు చూడాలి కదా, కనీసం రియాక్ట్ అవ్వాలి ఆ రెండూ చేయకపోగా క్యాండీ క్రష్ ఆడుకుంటున్నారు. ప్రత్యర్థులే జాలి పడాల్సిన పరిస్థితి జగన్ ది !

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *