బిడ్డకు పాలిస్తున్నానని మహిళ అరిచినా పోలీసులు ఏం చేశారో చూడండి!! (వీడియో)

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

ఫ్రెండ్లీ పోలీస్ అని ఎవరు ఎంతగా మొత్తుకుంటున్నా, తమ కరుకు గుండెలు మాత్రం మారబోవని ఖాకీలు కొన్ని సందర్భాల్లో నిరూపిస్తునే ఉన్నారు. ముంబైలో జరిగిన తాజా ఘటన ఇందుకు మరో ఉదాహరణగా నిలుస్తోంది. కారులో వెళ్తున్న ఓ తల్లి తన బిడ్డ ఆకలితో ఏడుస్తుండడంతో కారును రోడ్డుపై ఆపి పాలిస్తోంది.

రోడ్డుపై ‘నో పార్కింగ్’ ప్రదేశంలో ఆగిన కారును చూసిన ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. కారులో మహిళ ఉందని, ఆమె తన బిడ్డకు పాలిస్తోందని తెలిసినా ఏ మాత్రం కనికరం చూపలేదు. మానవత్వాన్ని మర్చిపోయారు.

మహిళ, చిన్నారి కారులో ఉండగానే రికవరీ వ్యాన్‌కు ఆ కారును తగిలించి తీసుకుపోయారు. తాను కారులో ఉన్నానని, బిడ్డకు పాలిస్తున్నానని మహిళ అరిచి గీపెట్టినా పోలీసులు పట్టించుకోలేదు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన ముంబై జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) అమితేష్ కుమార్ దర్యాప్తుకు ఆదేశించారు.

వీడియో కింద ఇంకా ఈ అంశం గురించి ఆ తల్లి బిడ్డల ఫోటో వివరంగా తెలుపబడినవి దయచేసి చదవగలరు

తాను పాలిస్తున్నానని, తనకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని, కనీసం కిందకి దిగమని కూడా అడగలేదని బాధిత మహిళ జ్యోతి మలే మీడియాకు తెలిపింది. పిల్లకు తల్లి పాలిస్తున్నా పోలీసులు కనికరం చూపని వీడియో ఇప్పుడు దేశం మొత్తం వైరల్ అయింది. మీరూ చూడాలనుకుంటే పైన క్లిక్ చేయండి..

Loading…


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *