‘బాహుబలి’ స్టంట్.. విసిరికొట్టిన ఏనుగు, అతగాడికి ఏమైందో చూస్తే గుండెలు అదురుతాయ్!! (లైవ్ వీడియో)

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

ఏనుగు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ దాన్ని విసిగిస్తే మాత్రం చెలరేగిపోతుంది. అప్పటి వరకు మనం పెట్టినవి తిని, అడిగిన ప్రశ్నలకు తలాడించిన ఆ ఏనుగే.. దాన్ని ఇబ్బంది పెడితే గాల్లోకి విసేరిస్తుంది. కిందేసి తొక్కేస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ‘బాహుబలి 2’ సినిమాలో హీరో ప్రభాస్.. ఏనుగు తొండంపై నిలుచుని పైకెక్కుతాడు. తాను కూడా అలాగే చేద్దామని ఓ కేరళ యువకుడు ప్రయత్నించాడు. తన స్నేహితుడితో కలసి తోటలో ఉన్న ఏనుగు వద్దకు వెళ్లాడు.

కేరళలో ఇడుక్కి జిల్లాలలోని థోడుపూళా అనే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బాహుబలి స్టంట్ చేయాలని భావించాడు. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఏనుగుకు అరటిపండు అందించాడు. ఆ తర్వాత ఏనుగు తలపై ముద్దు పెట్టాడు. అంతటితో ఆగకుండా మెల్లగా ఏనుగు దంతాలు పట్టుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఇదంతా అతడి స్నేహితుడు లైవ్ వీడియో తీస్తున్నాడు. అరటి పళ్లు పెట్టినంతసేపు అది చక్కగా తొండంతో అందుకుని ఆరగించింది. ఇక మన దారిలోకి వచ్చిందిలే అనుకున్నాడేమో మన కేరళ బాహుబలి..

ఏనుగు దగ్గరగా వెళ్లి తొండ పట్టుకుని దాని నుదుటిన ముద్దాడబోయాడు. స్నేహితుడు హెచ్చరిస్తున్నా మనోడు మాత్రం బాహుబలి స్టంట్ చేయడానికి రెడీ అయిపోయాడు. అంతే ఏనుగుకి చిర్రెత్తికొచ్చినట్టుంది.. ఒక్క ఉదుకున అతన్ని గాల్లోకి ఎగరేసి కొట్టింది. తలకిందులుగా అంత దూరాన ఎగిరిపడ్డ అతన్ని వెంటనే తన మిత్రుడు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మొత్తానికి మన కేరళ బాహుబలి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాహుబలి సినిమాలో ఈ స్టంట్ చేసిన ప్రభాస్ ఎంత ఫేమస్ అయిపోయాడో ఇప్పుడు ఆ స్టంట్ చేయబోయి చావు తప్పి బతికి బట్టకట్టిన మనోడూ అంత ఫేమస్ అయ్యాడు. గుండెలు అదిరిపోయే ఆ వీడియోను కింద క్లిక్ చేసి చూడండి..

Loading…


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source from: http://www.telugu.timesebuzz.com/category/latest-updates/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *