బాబు ఇప్పటికే అయ్యాడు హీరో ఉద్యమం చేయకపోతే నీవు జీరో జగన్‌కి బీజేపీ కబురు పంపిందా?

2014 ఎన్నికల్లో సోనియా రాష్ట్ర విభజన చేసేటట్టు, జైలు నుంచి తాను బయటకు పంపించిన జగన్‌ దానిని వ్యతిరేకించినట్టు, విభజనకు కారణం చంద్రబాబే అని ఇద్దరూ కలిసి నమ్మించేటట్టు, మధ్యలో జనం వెర్రిపూవులు అని భావించేటట్టు జగన్‌కి-సోనియా గాంధీకి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగింది. దానిలో భాగమే సీబీఐ ఏ మాత్రం అవగాహన లేని లాయర్లను వాదనలకు పంపి, సరైన డాక్యుమెంట్లు కోర్టు ముందు ఉంచకుండా జగన్‌కు బెయిల్‌ రావటానికి కారణం అయింది. జైలు నుంచి వచ్చి రాష్ట్ర విభజన వ్యతిరేక ఉద్యమం చేసి హీరో అయి గెలిచిన ఎంపీలను సోనియా పాదాల దగ్గర పెట్టాలన్నది వారి ఒప్పందం.

ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా అదే ఢిల్లీకి ఈసారి బీజేపీకి అలాగే కేసుల కోసం వంగిపోయి, లొంగిపోయి కేంద్రాన్ని ఎదిరిస్తున్న చంద్రబాబును ఉభయులు కలిసి టార్గెట్‌ చేయాలనేది కండీషన్‌. చంద్రబాబు వీక్‌ అయితే ఏపీలో మూడో ఫ్రంట్‌కు అవకాశం లేకుండా పోతుందనేది ఢిల్లీ ఆశ. జగన్‌ వాళ్ల చేతిలో పావుగా మారి ఏపీకి ద్రోహం చేస్తున్నాడు. బీజేపీ ఆదేశాల మేరకు ఆలస్యంగా మేలుకొని హోదా కోసం ఉద్యమం చేస్తున్నాడు. దాని వెనకాల బీజేపీ సూచనలు, సలహాలు ఉన్నట్టు సమాచారం. ఇదంతా ఎందుకు అంటే….ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఏపీకి అన్యాయం చేశారని బడ్జెట్‌ ప్రసంగం అవటంతోనే తెలుగుదేశం నాయకులు టీవీ స్టూడియోల్లో, చర్చల్లో రెచ్చిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిరసన ర్యాలీలు అదే ఫిబ్రవరి 1 సాయంత్రంలోపు చేశారు. ఎక్కడా తగ్గకుండా విజృంభించండి అని చంద్రబాబు సందేశం ఇచ్చారు. ఇంకేముంది ఫిబ్రవరి 2 నుంచి ఏపీలో, ఢిల్లీలో బీజేపీకి తెలుగుదేశం సినిమా చూపించడం ప్రారంభించింది. బీజేపీకి కలవరం పుట్టింది. చంద్రబాబు ప్రతిరోజు తెలుగుదేశం ఎంపీలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఉద్యమం చేయిస్తున్నారు. మరోపక్క సిగ్గులేకుండా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ చూసి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో అద్భుతం అని పొగిడాడు. ఏపీకి వచ్చి అదేదో రాష్ట్ర బడ్జెట్‌ అయినట్టు చంద్రబాబును టార్గెట్ చేశాడు. వాళ్ల నాయకుడు జగన్‌ అయితే మూడురోజుల పాటు బడ్జెట్‌పై మాట్లాడకుండా మూసుకుని కూర్చున్నాడు. బీజేపీ-వైసీపీ కుమ్మక్కు అయ్యాయని జనం మొత్తం ఛీ కొట్టడం ప్రారంభించారు. బడ్జెట్‌ బాగుందని విజయసాయిరెడ్డి ఎలా అంటాడని కడిగేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రాకు అన్యాయం జరిగిందని ప్రజలు గొడవ చేస్తుంటే…బడ్జెట్‌ బ్రహ్మాండంగా ఉంది…

టిడిపి వల్లే రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ…సెల్ఫ్‌గోల్‌ వేసుకున్న వైకాపా నేతలు ఇప్పుడు పోయిన పరువు రాబట్టుకునేందుకు కొత్త ప్లాన్‌ వేశారు. బిజెపి, వైకాపా కుమ్మక్కు కావడం వల్లే…ఆంధ్రాకు ‘మోడీ’ అండ్‌ కో నిధులు ఇవ్వకుండా ఎండబెడుతున్నారనే మాట రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న పరిస్థితుల్లో తాము వారితో కుమ్మక్కు కాలేదని…తాము రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని నిరూపించుకునేందుకు వైకాపా తాజాగా జంతర్‌మంతర్‌ నాటకానికి తెరతీసిందని రాజకీయ పండితుల సమాచారం. గల్లా జయదేవ్‌ సహా టిడిపి ఎంపీలు తమ పోరాటంతో ఆంధ్ర ప్రజల మన్ననలు పొందగా వైసీపీ ఎంపీలు పార్లమెంటులో మోడీ కంటపడకుండా సభ బయట ఫోటోలకు ఫోజులిస్తున్నారు. కేంద్రం ఈ క్రెడిట్‌ టిడిపి ఖాతాలో పడకుండా ఉండేందుకే.. వైకాపాతో కలసి కొత్త నాటకానికి తెరతీశాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *