బాబుపై అనిల్‌ కుంబ్లే కామెంట్స్‌ అదిరెనులే!

ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును ప్రశంసించే సెలబ్రిటీల జాబితాలో ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్, లెగ్‌ స్పిన్నర్ అనిల్‌ కుంబ్లే కూడా చేరారు. ఆ మద్య హీరో మాధవన్‌తో పాటు తమిళనాడులో నూతన రాజకీయ పార్టీ స్థాపించబోతున్న కమల్‌హాసన్‌ కూడా తాను చంద్రబాబు అభిమానిని అని ఆయన విజన్‌, అభివృద్ధి ఎజెండాకు తాను ఎప్పుడు ముగ్థుడును అవుతానని రీసెంట్‌గా టైమ్స్‌ నౌ ఛానెల్‌లో చెప్పారు. వైజాగ్‌లో ఓ సదస్సులో పాల్గొన్న జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌ కూడా ఇటీవల సీఎంపై ప్రశంసల జల్లు కురిపించారు. హుద్‌హుద్‌ తుఫాన్‌తో కోలుకోలేని రీతిలో దెబ్బతిన్న విశాఖ మహానగరాన్ని వారం రోజుల్లో సాధారణ స్థితికి తీసుకువచ్చారని కొనియాడారు. కేరళకు చెందిన సురేష్‌ గోపీ మొన్న అమరావతి వచ్చినప్పుడు చంద్రబాబును ప్రశంసించటమే కాదు పాదాలకు నమస్కారం చేసి మరీ తన అభిమానాన్ని చాటుకున్నారు.

విజయవాడ వచ్చిన కుంబ్లే బాబును ప్రశంసలతో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డైనమిక్‌ లీడరని, ఏపీలో క్రీడల అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కొనియాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన ఉత్సవాల్లో కుంబ్లే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలకల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. వివేకానందుడి జీవితం నేటి తరానికి మార్గదర్శకమని, వివేకానందుడు సూచించిన మార్గాన్ని యువత అనుసరించాలని ఆయన పిలుపు ఇచ్చారు. క్రీడలు మానసిక వికాసాన్ని, క్రమశిక్షణను నేర్పుతాయని కుంబ్లే వ్యాఖ్యానించారు.


Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *