బాబుది యూనివర్సిటీ జగన్‌ది ఇంకా ప్లే స్కూలే

రాజకీయాల్లో ఎత్తులు వేయటం సహజం. వాటికి అవతలి పక్షం ఎత్తుకు పై ఎత్తు వేయటం అంతే సహజం. అయితే తెలుగు సినిమా క్లయిమాక్స్‌లాగా తర్వాత సీన్‌ ఏం జరగబోతోందో ప్రేక్షకుడికి తెలిసిపోతే ఇంక కిక్కేముంటుంది. జగన్‌ రాజకీయం అంతా కూడా ప్లే స్కూల్‌లో పిల్లల స్థాయిలో ఉంటుంది. అతని అపరిపక్వత, ఎదుటి వారి నుంచి మంచిని స్వీకరించే స్వభావం లేకపోవటం, అవతలివారు చెప్పేటప్పడు వినే ఓపికా ఇవేవీ జగన్‌ బాబుకు లేవు. అందుకే జగన్‌ లాలాపేట లెవెల్లో ఆడతాడు బాబు లార్డ్స్‌ లెవెల్లో తిప్పికొడతాడు.

ఉదాహరణకి ఈ ఎత్తుగడ చూడండి. ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి పెట్టడానికి పాదయాత్ర స్టార్ట్‌ చేశాడు జగన్‌. సహజంగా ఆర్నెళ్ల పాటు సాగే ఈ పాదయాత్రకి పబ్లిసిటీ గట్రా రావాలంటే మొదటిరోజు లేదా ఓ నాలుగురోజులు ఆసక్తి ఉంటుంది. తర్వాత అందరికీ అదో రొటిన్‌ కార్యక్రమం అయిపోతుంది. అది సహజమే. జగన్‌ పాదయాత్ర అనే గీత ముందు పెద్ద గీత గీసేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నవంబర్ 2 నుంచి పాదయాత్ర తలపెట్టాడు జగన్. ఇదే సమయంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలను అధికారపక్షం ప్లాన్ చేసి దిమ్మతిరిగేలా చేసింది. ఈ శీతాకాల సమావేశాలను పదిరోజుల పాటు నిర్వహిస్తామని ఇప్పటికే స్పీకర్ ప్రకటించారు. జగన్ పాదయాత్రలో ఏం మాట్లాడినా అసెంబ్లీలో కౌంటర్ లు ఇచ్చేలా పక్కా వ్యూహంతో టిడిపి సిద్ధం అవుతోంది.

పైగా మీడియా అంతా కూడా ఒక్క సాక్షిని మినహాయిస్తే అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అసెంబ్లీకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. సాక్షి టీవీ ఎలాగూ ప్రజలు, ప్రజా సమస్యలు పట్టించుకోదు. జగన్‌ సీఎం అవటమే సాక్షి టీవీ సమస్య అంతా. అందుకే జగన్ అడుగులో అడుగు వేస్తుంటే 3000 కిలోమీటర్లు వెంట ఉండి చూపిస్తుంది. కానీ మిగతా మీడియా అంతా అసెంబ్లీ సమావేశాలు ఇవ్వక తప్పదు. అప్పుడు హెడ్‌లైన్స్‌లో తొలి వార్తలు అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వ నిర్ణయాలే అవుతాయి. జగన్‌ పాదయాత్ర వెనక్కి పోతుంది. ఇది కేవలం సాంపుల్ మాత్రమే. ఇంకా పాదయాత్ర స్టార్ట్‌ అయ్యాకా చాలా ట్విస్టులు చూడాల్సి ఉంటుంది.

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *