పాపిష్టి కళ్లు పడకుండా సీమ వాసులు దిష్టి తీసుకోండి

వాళ్లు ఏలిన రోజుల్లో, వారి పెత్తనం నడిచిన రోజుల్లో సీమలో రక్తం పారించారు. వరుస హత్యలు, ఫ్యాక్షన్‌ రాజకీయాలతో రాయలసీమ అంటే హింసకు, కరువుకు సింబల్‌గా వారే ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు ఈరోజు సీమ డెఫినెషన్ మార్చేశారు. 17 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు సీమలో పెరిగాయని జలవనరుల శాఖ ప్రకటించింది. ఇంత కాలం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి రెండిటినీ కలిపి ఉభయ గోదావరులు అనే వాళ్లం. కానీ తమ చెరువులు నిండిన సంతోషంలో సీమలో ఇప్పుడు అభయ గోదావరులు అని పిలుస్తున్నారు.

సీమ గబ్బు బిడ్డ ఆ జిల్లాలలో తిరిగి పోలవరం మీద చిచ్చుపెట్టాలి అని అరిచి ఎంత ప్రయత్నించినా 165 కిలోమీటర్ల దూరం పట్టిసీమ కాలువలకు భూములను ఇచ్చి సహృదయం చాటుకొన్న గోదావరోళ్ల త్యాగమే ఒకప్పుడు రతనాలు రాసులు పోసి అమ్మిన చోట కరువు తాండవించిన సీమలో కియాలాంటి సంస్థల రాకకు మార్గం చూపింది. అంతే కదా నీళ్లు ఇస్తామంటేనే కదా పరిశ్రమలు వచ్చేది. కరువు భయాన్ని పోగొట్టి అభయం ఇచ్చిన ఆ గోదావరులను గుండె నిండా అభయ గోదావరులని అభిమానంగా పిలుస్తున్నాము. చంద్రబాబు వచ్చాకే కదా మన రాయలసీమ ఇసుక భూముల్లో కోట్లు పండుతున్నాయి? పట్టుమని పది చినుకులు కూడా రాలడం ఎప్పుడూ చూడని రాయలసీమ ఇసుక భూములు ఇపుడు హాట్ కేకుల్లా అమ్ముడవుట్లేదా? ఎకరం పదివేలు పదిహేను వేలకి అమ్ముడైన చోట ఇప్పుడు ఎకరం అరకోటి అమాంతం పలుకట్లేదా? రైతుల కళ్లల్లో… పేదల గుండెల్లో సంతోషాలు నింపట్లేదా? కొరియా కార్ల కంపెనీ కియా రంగంలోకి దిగటం, పనులు మొదలు పెట్టటం ఎప్పుడో జరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కార్ల కంపెనీల్లో టాప్ పైవ్ లో ఉండే కియా… ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ప్లాంట్ ని మన అనంతలో మొదలుపెట్టేసింది. ఇక్కడ గంటకి 820 కార్లు తయారవుతాయ్ అంటే ఊహించుకోండి ఇక ! అనంత జిల్లా పెనుగొండ నియోజకవర్గం అమ్మవారి పల్లె దగ్గర్లో 600 ఎకరాలు కియా కోసం కేటాయిస్తే అందులో 30 ఎకరాల్లో కళ్లు చెదిరే స్థాయిలో కొరియన్ టౌన్ షిప్ రెడీ అవుతోంది. అబివృద్ధి మోడల్ అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తోంది. ఏపీ రూపురేఖలు మారుస్తోంది !

కియా రాకతో చుట్టుపక్కల భూములన్నీ హాట్ కేకులు అయిపోయాయ్. అంత ఆటోమొబైల్ దిగ్గజం వచ్చేసరికి కంపెనీలు ఓ పక్కనుంచి క్యూ కడుతున్నాయ్. చుట్టుపక్కల డెవలప్ మెంట్ ఊపందుకుంది. ఎందుకంటే కియా ప్లాండ్ 30 వేల మందికి ఉద్యోగాలిస్తుంది. వాళ్లు ఉండటానికి… అద్దెకి దిగడానికి అన్నిటికీ తగ్గట్టుగా చుట్టుపక్కల ప్రాంతాలు మారిపోతున్నాయ్. చంద్రబాబు ఏం చేయగలడో కళ్లు ఎదురుగా కనిపించటం లేదా? ఇవన్నీ చేస్తున్నప్పుడు సహజంగానే తమ రాజకీయ జీవితం కోసం సీమను పెట్టుబడిగా పెట్టి జూదం ఆడే వాళ్ల ఆట కట్టయింది. కడపుమంటతో వాళ్ల కళ్లు ఈమధ్య సీమ మీద పడుతున్నాయి. సీమ జనం దిష్టి తీయించుకోండి.

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *