పండక్కి ఇంటికి వెళ్లినా పనేనా బాబూ..? కూసింత పెశాంతంగా ఉండొచ్చుగా..!

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి సంబరాలు బంధువులు, ఆత్మీయులతో నిర్వహించుకోవడానికి శనివారం సాయంత్రం 6.40 గంటల సమయంలో భారీ కాన్వాయ్‌తో తన జన్మభూమి నారావారిపల్లికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రాక కోసం వేచి ఉన్న వేలాదిమంది తెదేపా శ్రేణులు, కార్యకర్తలు కేరింతలతో హోరెత్తించారు. ఇంటిముందర గేటు వద్ద వాహనం దిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును సత్కరించడానికి నాయకులు పోటీ పడ్డారు. ఆయన చిరునవ్వుతో కొందరు నాయకుల్ని, గ్రామస్థులను పేరు..పేరునా పలుకరించారు. మరోవైపున భద్రతాబలగాలు ఆయకు రక్షణవలయంగా ఏర్పడటంతో ప్రధాన గేటు మార్గం ద్వారా ఇంటిలోనికి వెళ్లారు.

7.05 గంటల సమయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ నారావారిపల్లికి చేరుకున్నారు. ప్రధాన గేటువద్ద వాహనం నుంచి కిందకు దిగారు. అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి సొంతూర్లకు వచ్చే సంప్రదాయాన్ని తామే మొదలు పెట్టామని సీఎం చంద్రబాబు చెప్పారు. తన సతీమణి భువనేశ్వరి ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టిందని, గత కొన్నేళ్లుగా తన సొంతూరు నారావారిపల్లెకు రావడం ఆనవాయితీగా మారిందన్నారు. అంతా కరెక్టే కానీ పండక్కి సరదాగా బంధు మిత్రులతో కలవటానికి వెళ్లారు కదా బాబు గారూ వెళ్లిన వాళ్లు చక్కగా వారితో గడపవచ్చు కదా? మీ బంధు మిత్రులను సచివాలయం వైపు రావటానికి కూడా మీరు అనుమతించరు. సింహంగా గర్జిస్తారు ఎవరన్నా వస్తే. కనీసం పండక్కి వచ్చినప్పుడైనా వారితో మాట్లాడి ప్రేమాభిమానాలు పంచుకోండి. ఊరిలోకి వచ్చాకా కూడా ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవటం, అధికారులతో సమీక్షలు జరపటం, ప్రజల కష్టసుఖాలు వినటం ఇవన్నీ మీ వ్యక్తిగత సమయాన్ని హరించేస్తున్నాయి కదా. అయినా మీరు ఎన్ని చెప్పినా మారరు. ఎందుకంటే మీరు పని రాక్షసుడు. మీరు అలా పనిచేస్తుంటే వాటి ఫలాలు మేం అందుకుంటాము. ఫలాలు ఇచ్చిన చెట్టుపైనే రాళ్లు వేస్తాము. మీరు మారరు, మా బుద్ది మారదు బాబు గారు మమ్మల్ని క్షమించండి.


Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *