నితిన్ వెదర్ రిపోర్ట్ చెపుతున్నాడు!

‘ఛల్ మోహన్ రంగా’ అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో అందరిలో ఆసక్తిని పెంచేసిన కుర్ర హీరో నితిన్ ఇప్పుడు ‘ఛల్ మోహన్ రంగా’ టీజర్ తో కుమ్మేస్తున్నాడు. గత సినిమా ‘లై’ ఇచ్చిన డిజాస్టర్ ఛాయలు అసలు నితిన్ మీద పడలేదేమో అన్నట్టుగా… కనబడుతుంది ఈ సినిమా. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని లిరికిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. మళ్ళీ ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు నితిన్. ఈ సినిమాలో ‘లై’ సినిమాలో తనతో నటించిన మేఘ ఆకాష్ తోనే  రొమాన్స్ చేస్తున్నాడు నితిన్. మరి నిన్నగాక మొన్న టైటిల్ తో ఆకట్టుకున్న నితిన్, మేఘ ఆకాష్ లు ఇప్పుడు వాలంటైన్స్ డే రోజున ‘ఛల్ మోహన్ రంగా’  టీజర్ తో వచ్చేశారు.

మరి ఈ టీజర్ ని కట్ చేసిన తీరుని బట్టి ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీ అనేది మాత్రం పూర్తిగా అర్ధమవుతుంది. నితిన్ ఈ టీజర్ లో తన లవ్ స్టోరీ ఎలా మొదలైందో చెప్పే తీరు మాత్రం కొత్తగా ఆకట్టుకుంటుంది. ‘భయ్యా  మీ లవ్ స్టోరీ ని చెప్పండి అని బ్యాగ్రౌండ్ లో ఒకగొంతు అడగగా దానికి నితిన్ మేం వర్షం కాలంలో కలసి…. శీతాకాలంలో ప్రేమించుకుని.. వేసవి కాలంలో విడిపోయాం’ అంటూ చెప్పగా ఆ బ్యాగ్రౌండ్ లోని గొంతు మళ్ళీ…. ‘అంటే మీరిద్దరూ వెదర్ రిపోర్టర్లా భయ్యా’.. అంటూ వేసిన సెటైరికల్ పంచ్ అదిరింది. మరి విజువల్స్ లో నితిన్ ఎక్సప్రెషన్స్, మేఘ ఆకాష్ మంచులో నుండి నడుస్తూ రావడం ఇలా అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో హీరోయిన్ మధ్యన రొమాంటిక్ యాంగిల్ కూడా అదరహో అనేలా ఉంది.

మరి నితిన్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రేమ కథలతో హిట్స్ మీద హిట్స్ కొట్టేస్తున్నాడు. మధ్యలో ప్రయోగాలు అంటూ చేసిన లై లాంటి సినిమాల్తో దెబ్బలు తింటున్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు తనకు లైఫ్ ఇచ్చిన ప్రేమకథనే మరోసారి నమ్ముకుని ‘ఛల్ మోహన్ రంగా’ అంటున్నాడు. ఇకపోతే ఈ సినిమా టీజర్ లో మనం చెప్పుకోవాల్సిన మరో అద్భుతం బ్యాగ్రౌండ్ మ్యూజిక్. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే ఇరగదీశాడు. క్యూట్ లవ్ స్టోరీకి ఉండాల్సిన క్యూట్ మ్యూజిక్ లా మనసుకు హత్తుకునేలా ఉంది. మరి టీజర్ తోనే మ్యాజిక్ చేసి సినిమా మీద బజ్ పెంచేసిన నితిన్, మేఘ ఆకాష్ లు ఏప్రిల్ 5 న ఎలాంటి మ్యాజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి.

Click Here For Teaser

Source From: http://www.cinejosh.com/rss-feed/0/telugu.html

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *