“నాగార్జున, సమంత” కీలక పాత్రల్లో నటించిన “రాజు గారి గది -2” హిట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్(తెలుగులో)

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Movie Title (చిత్రం): ‘రాజు గారి గది 2 (Raju Gari Gadhi 2)

Cast & Crew:

 • నటీనటులు: నాగార్జున, సమంత, అశ్విన్, సీరత్ కపూర్, వెన్నెల కిశోర్, షకలక శంకర్‌ తదితరులు

 • సంగీతం: థమన్

 • నిర్మాత: ప్రసాద్ వి పొట్లూరి (పి వి పి సినిమా, మ్యాటినీ ఎంటెర్టైన్మెంట్స్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్)

 • దర్శకత్వం: ఓంకార్

Story:

రాజు గారి గది 2 మూవీ ఓ ఆత్మ చుట్టూ అల్లిన కథ. ఓ ఇంట్లో సమంత చనిపోయి ఆత్మగా ఉంటుంది. అదే ఇంట్లోకి నలుగురు ఫ్రెండ్స్ అశ్విన్, సీరత్ కపూర్, వెన్నెల కిశోర్, షకలక శంకర్‌ వెళ్లతారు. రోజు రాత్రి కాగానే రకరకాల శబ్దాలతో ఆ ఇల్లంతా భయంకరంగా ఉంటుంది. దీంతో మానసిక వైద్యుడైన నాగార్జున ఆ ఇంటిలో ఆత్మ ఉన్నట్టు గుర్తిస్తారు. దీంతో

ఆ ఆత్మను బయటకు పంపే క్రమంలో అసలు సమంత ఎందుకు చనిపోయింది. ఆత్మగా ఎందుకు మారింది. ఆ ఇంట్లో ఎందుకు ఉంది? అనే రహస్యాలను రాబడతాడు. చివరికి ఆత్మ బయటకు వెళుతుందా? అనేది అసలు కథ.

Review:

హైక్వాలిటీ విఎఫెక్స్, ఆద్యంతం ఆకట్టుకొనే కథాంశంతో తెరకెక్కించిన ఈ మూవీలో సమంత డి గ్లామ‌ర్ పాత్ర‌లో క‌నిపించింది. తొలిసారిగా హ‌ర్ర‌ర్ నేప‌థ్యం మూవీలో న‌టించిన స‌మంత లాయ‌ర్ అమృతగా అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చినట్టు ఓవర్సీస్ రిపోర్ట్‌ను బట్టి తెలుస్తోంది. మంత నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని.. సెకండాఫ్‌లో ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులను

ఆకట్టుకునేవిధంగా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా నాగార్జున-సమంత మధ్య వచ్చే సీన్‌లు సినిమాను ఓ స్థాయికి తీసుకువెళ్లేవిధంగా ఉంటాయంటున్నారు. ఇక హైటెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కించిన ఈ మూవీలో గ్రాఫిక్స్ బాగా వచ్చాయని, థమన్ మ్యూజిక్ సినిమాకు బలాన్నిచ్చేదిగా ఉందంటున్నారు. ఈ మూవీలో గ్లామర్ డోస్ కూడా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. సీరత్ కపూర్ బికినీ

అందాలతో అదరగొట్టింది. వెన్నెలకిషోర్, అశ్విన్, షకలక శంకర్ల కామెడీ బాగుంది. అయితే సినిమాలో అక్కడక్కడా ‘రాజుగారి గది’ ఛాయలు కనిపిస్తాయి. ఓవరాల్‌గా హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో మంచి కామెడీని జతకలిపిన ‘రాజు గారి గది 2’ ప్రేక్షకులకు మంచి వినోదం అందించడం ఖాయమే.

Plus Points:

 • కథ, కథనం

 • హర్రర్ కు కామెడిని జత చేసి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం సక్సెస్ అయ్యింది.

 • బొమ్మాళిగా పూర్ణ, అశ్విన్, చేతన్ ల నటన బావుంది.

 • షకలక శంకర్, ధనరాజ్, విద్యుల్లేఖ

 • పోటీ పడి కామెడి పండించే ప్రయత్నం చేశారు.

 • మ్యూజిక్

 • సినిమాటోగ్రఫీ

 • డైలాగ్స్

 • నిర్మాణ విలువలు చాలా బావున్నాయి

Minus Points:

 • దయ్యమున్న ఇంటికి వెళ్లడం అనే కాన్సెప్ట్ పాతదే.

 • ఫస్టాఫ్ లో కామెడీతో సాగిన సినిమా సెకండాఫ్ లో కాస్త డల్ గా సాగినట్టు అనిపిస్తుంది.

Final Verdict:

హారర్ తో పాటు కామెడీ తో ఎంటర్టైన్ చేసే సినిమా “రాజు గారి గది -2”

timesebuzz Rating: 3 / 5

 • Loading…


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *