నటుడు చిన్నా భార్య మృతి.! చిన్నా గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇవే.!

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

యాక్టర్ చిన్నా..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సీనియర్ నటుడు.క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు..మీ శ్రేయోభిలాషిలో కథను మలుపుతిప్పే క్యారెక్టర్ లో చిన్నా నటించారు..చిన్నా భార్య శిరీష (42) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని చిన్నా మీడియాకు తెలిపారు.  శిరీష మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

1965 లో రామచంద్రమ్మ, రాజేశ్వర్ రెడ్డి దంపతులకు నెల్లూరు లో చిన్నా జన్మించాడు. చిన్నా అసలు పేరు ఆరుగుంట జితేందర్ రెడ్డి..మధురా నగరిలో సినిమాతో  టాలివుడ్ కి పరిచయం అయ్యారు..హీరో శ్రీకాంత్ తొలిచిత్రం కూడా అదే..1989లో  వర్మ దర్శకత్వంలో వచ్చిన  శివ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో అతని పాత్ర పేరు చిన్నా. తరువాత అదే అతని అసలు పేరుగా మారింది.వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్రి సినిమాలో సీనియర్ యాక్టర్ రేవతికి జోడిగా నటించారు చిన్నా.తెలుగులో వచ్చిన హారర్ మూవీస్ లో రాత్రి సూపర్ డూపర్ హిట్ మూవీ..మనీ చిత్రంలో కూడా జెడి చక్రవర్తితో కలిసి నటించారు చిన్నా..మనీ

ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే.1993 లో వచ్చిన అల్లరి పిల్ల సినిమాకు గాను చిన్నాకు వంశీ బర్కిలీ స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది.అల్లరి పిల్లలో మీనా,సురేశ్ లతో కలిసి నటించారు చిన్నా.తర్వాత కొన్ని సీరియల్స్ లో యాక్ట్ చేసి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. ఆ ఇంట్లో సినిమాతో దర్శకుడిగా కూడా మారారు చిన్నా.హీరోగా ,కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టు గా చేసిన చిన్నా సీరియల్స్ లో నెగటివ్ రోల్స్ పోషించారు. చిన్నాకు మౌనిక, భావన అనే ఇద్దరు కూతుర్లున్నారు.

Loading…


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source from: http://www.telugu.timesebuzz.com/category/latest-updates/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *