దారుణం కాల్ సెంటర్ లో బూతు బాగోతం.. యువతులతో రొమాంటిక్ వాయిస్ ఛాట్, హస్కీ వాయిస్ తో మాట్లాడితే …….ఏం చేస్తారంటే

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే కుటుంబాల‌కు చెందిన అమ్మాయిలు ఏదో ఒక ఉద్యోగం వ‌స్తే చాలు, దాంతో ఇంటికి కొంత ఆస‌రాగా ఉంటుంద‌ని భావిస్తారు. త‌మ‌కు నెల నెలా ఎంతో కొంత జీతం వ‌చ్చినా దాంతో కుటుంబంలో ఏదో ఒక స‌మ‌స్య పోతుంది క‌దా అని అనుకుంటారు. అందులో భాగంగానే అలాంటి అమ్మాయిలు ఉద్యోగం కోసం వెదుకుతుంటారు. ఎక్క‌డైనా ఉద్యోగం దొరికితే వెంట‌నే త‌మ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని భావిస్తూ ఉద్యోగాన్వేష‌ణ చేస్తుంటారు. అలాంటి

వారికి నిజంగా ఒక్కోసారి కొంద‌రు ప్ర‌బుద్ధులు దొరుకుతారు. వారు స‌ద‌రు అమ్మాయిల‌తో అస‌భ్య‌క‌ర‌మైన ప‌నులు చేయించ‌డానికి కూడా వెనుకాడ‌రు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. ఉద్యోగం కోసం వ‌చ్చే యువ‌తుల‌కు వ‌ల వేసి వారిని ట్రాప్ చేసి హాట్ కాలింగ్ దందాలోకి దింపుతున్నాడు ఓ ప్ర‌బుద్దుడు. చివ‌ర‌కు ఓ అమ్మాయి ధైర్యం చేసి బ‌య‌ట‌కు చెప్ప‌డంతో ఈ హాట్ కాలింగ్ దందా బ‌య‌ట ప‌డింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

Watch…

గుంటూరుకు చెందిన వీరాస్వామి, భువ‌నగిరికి చెందిన భ‌వానిల‌కు గ‌త కొంత కాలం కింద‌ట పరిచ‌యం ఏర్ప‌డింది. దీంతో వారు హాట్ కాలింగ్ దందాను ప్రారంభించారు. వీరు మొద‌ట్లో పేప‌ర్ల‌లో క్లాసిఫైడ్ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేవారు. కాల్ సెంట‌ర్ వ్యాపారం అని చెప్పి మంచి వాయిస్ ఉన్న అమ్మాయిలు కావాల‌ని ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేవారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల‌కు ఆక‌ర్షితుల‌య్యే యువ‌తులు భువ‌న‌గిరిలోని మీనా న‌గ‌ర్‌లో ఉన్న వీరాస్వామి, భ‌వానిల ఆఫీస్‌కు వ‌చ్చేవారు. అక్క‌డ ఆ యువ‌తుల‌కు కేవ‌లం ఇన్‌క‌మింగ్ స‌దుపాయం మాత్ర‌మే ఉండే సిమ్ కార్డు, ఫోన్ ఇచ్చేవారు. రోజూ రాత్రి పూట ఫ‌లానా స‌మ‌యం నుంచి ఫ‌లానా స‌మ‌యం వ‌ర‌కు ప‌నిచేయాల‌ని, ఆ స‌మ‌యంలో కాల్స్ వ‌స్తాయ‌ని, వాటిని అటెండ్ చేసి క‌స్ట‌మ‌ర్ల‌తో స్వీట్ గా మాట్లాడితే చాల‌ని చెప్పేవారు. గంట‌కు రూ.30 ఇస్తామ‌ని, క‌స్ట‌మ‌ర్‌తో ఎక్కువ స‌మ‌యం పాటు మాట్లాడితే ఇంకా ఎక్కువ డ‌బ్బులను ఇన్‌సెంటివ్ కింద చెల్లిస్తామ‌ని వీరాస్వామి, భ‌వానిలు చెప్పేవారు.

ఇది నిజ‌మే అని న‌మ్మే యువ‌తులు హాట్ కాలింగ్‌లో ఉచ్చులోకి చేరేవారు. అయితే కొంద‌రు త‌మ త‌మ ఇండ్ల వ‌ద్ద నుంచే ఇలా రాత్రి స‌మ‌యాల్లో కాల్స్ అటెండ్ చేస్తుండ‌గా, కొంద‌రు ఆఫీస్‌కి వ‌చ్చి ప‌నిచేసేవారు. కాగా మొద‌ట్లో అంతా బాగానే ఉండేది. కానీ చివ‌ర‌కు అది కాల్ సెంట‌ర్ కాద‌ని, హాట్ కాలింగ్ అని తెలిసింది. ఫోన్లు చేసే వారు అస‌భ్య ప‌ద‌జాలంతో యువ‌తుల‌తో మాట్లాడుతుండే స‌రికి ఆ యువ‌తుల‌కు షాక్ కొట్టినంత ప‌నైంది. దీంతో వారు జాబ్ మానేస్తామ‌ని చెప్ప‌డంతో వీరాస్వామి, భ‌వానిలు స్పందించి.. ఆ అమ్మాయిలు మాట్లాడే మాట‌ల‌న్నీ త‌మ వ‌ద్ద రికార్డ్ అయి ఉన్నాయ‌ని, ఎక్కువ చేస్తే వాటిని ప‌బ్లిగ్గా రిలీజ్ చేస్తామ‌ని అమ్మాయిలను భ‌య‌పెట్టేవారు. దీంతో వారు ఆ ఉచ్చులోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది. అయితే చివ‌ర‌కు ఓ యువ‌తి ధైర్యం చేసి పోలీసుల‌కు ఈ విష‌యం చెప్ప‌డంతో ఎట్ట‌కేల‌కు ఈ హాట్ కాలింగ్ గుట్టు ర‌ట్ట‌యింది. దీంతో పోలీసులు స‌ద‌రు కాల్ సెంట‌ర్‌పై దాడి చేసి వీరాస్వామి, భ‌వానిల‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఏది ఏమైనా అమ్మాయిల‌ను ఇలా చేసే వారిని మాత్రం అస‌లు విడిచిపెట్ట‌రాదు..!

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *