టీడీపీ వైపు చిరంజీవి చూపు? మంత్రి గంటాతో మంతనాలు!

ఇటీవల ఓ ప్రముఖుడి ఇంట్లో జరిగిన శుభకార్యంలో చిరంజీవి, మంత్రి గంటా శ్రీనివాసరావు కలుసుకున్నారని సమాచారం. చిరంజీవితో వ్యక్తిగతంగా ఏంతో సన్నిహితంగా ఉండే మంత్రి గంటా మాటల మధ్యలో టీడీపీలో చేరండి, మీరింకా ప్రజాసేవ చేయాల్సింది చాలా ఉంది అని సూచించారట. సినిమాలు చేసినా ఏడాదికి ఒకటో రెండో కంటే చేయలేరు. మిగతా సమయం ప్రజాసేవకు వెచ్చించండని చెప్పినట్టు తెలిసింది.

వచ్చే ఏడాది ఎన్నికలు ఉంటాయి, అదే ఏడాది మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మీ టెర్మ్‌ ఎలాగూ అయిపోతోంది కాబట్టి ఈసారి టీడీపీ నుంచి ఎన్నికవ్వచ్చు..మీరు ఓకే అంటే బాస్‌తో నేను మాట్లాడతానని గంటా చెప్పినట్టు మీడియా సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. దీనిపై చిరంజీవి కూడా ఆలోచిస్తున్నారట. కాంగ్రెస్‌కు, వైసీపీకి భవిష్యత్తు లేదు, తమ్ముడి పార్టీలో చేరితో కుటుంబ పాలన అనే అపవాద వస్తుంది. ఉన్న అప‌్షన్‌ టీడీపీనే అని చిరంజీవి సన్నిహితులు కూడా చెప్పినట్టు తెలుస్తోంది.

చిరంజీవి కూడా గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ కార్య‌క్రమాల‌కు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ స‌మావేశంలో పాల్గొన‌డం లేదు. రాష్ట్ర‌ప‌తి,ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల టైమ్‌లో మాత్ర‌మే రాజ్య‌స‌భ‌స‌భ్యునిగా త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఆ త‌ర్వాత కూడా ఆయ‌న కాంగ్రెస్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం లేదు. చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం వ‌చ్చే మార్చిలో ముగుస్తోంది.

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *