టీడీపీ ఫ్లెక్సీలు కనబడితే చించేసేవారు ఒకనాడు మరి నేడో…?

తెలుగు రాష్ట్రాలలో పులివెందుల అంటే తెలియనివారు ఉండరు. నాలుగు తరాలుగా వైఎస్‌ కుటుంబసభ్యులే అక్కడి రాజకీయాలను శాసిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మూడో తరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పులివెందులను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో సొంత ఓటు బ్యాంకును తయారు చేసుకున్నారు. అప్పట్నుంచి పులివెందుల వైఎస్‌ ఫ్యామిలీకి కంచుకోటగా మారింది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.. పులివెందుల ప్రజలలో కూడా ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది.. జగన్మోహన్‌రెడ్డి పట్ల ఆ ప్రాంత ప్రజల్లో అభిమానం రోజురోజుకు సన్నగిల్లుతోందట! ఈ మాట ఆ ప్రాంత ప్రజల నోటివెంటే వచ్చింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో పోల్చుకుంటే జగన్‌ రాజకీయాల్లో సరితూగరని చెప్పుకుంటున్నారట! రాజకీయాల్లో జగన్‌ అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోలేదట! ఇదే అనువైన సమయమని భావించిన తెలుగుదేశంపార్టీ అక్కడ పాగా వేయడానికి దారులు వెతుక్కుంటోంది. పులివెందుల తెలుగుదేశంపార్టీ ఇన్‌ఛార్జ్‌ సతీశ్‌కుమార్‌ రెడ్డి.. మరో స్థానిక టీడీపీ నేత రామ్‌గోపాల్‌రెడ్డి చాలా కాలంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు.

ప్రాంత అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పులివెందుల ప్రజలకు మరిన్ని సంక్షేమపథకాలు అందించి ఆ ప్రాంత ప్రజలను టీడీపీకి దగ్గర చేసే పనిలో వీరిద్దరు సఫలీకృతులవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పులివెందులపై దృష్టిసారించారు. ఆ ప్రాంత ప్రజలకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. పులివెందుల నియోజకవర్గానికి గండికోట ప్రాజెక్టు నుంచి సాగు, తాగు నీరు అందించి వారి మనసులను గెల్చుకున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పులివెందులకు నీళ్లు అందించలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు కృష్ణా జలాలను గండికోట ప్రాజెక్టుకు తెప్పించి అక్కడి నుంచి పులివెందుల నియోజకవర్గంలో ఉన్న పైడిపాలెం.. చిత్రావతి ప్రాజెక్టులకు నీరు అందించడంతో పులివెందుల ప్రజల ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. పులివెందుల ప్రజలలో మార్పు వచ్చిందనీ.. తెలుగుదేశంపార్టీని ఆదరిస్తున్నారనీ చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గతంలో వైఎస్‌ హయాంలో పులివెందులలో వేరే పార్టీవారు కటౌట్లు పెట్టినా.. బ్యానర్‌లు కట్టినా సహించేవారు కాదు.. అన్నింటినీ వెంటనే తొలగించేవారు. అలాంటిది మొన్న పులివెందులలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. సీఎం రాక సందర్భంగా ఎన్నడూ లేని విధంగా పులివెందుల పట్టణమంతా టీడీపీ బ్యానర్లు వెలిశాయి.. భారీ కటౌట్లతో తొలిసారి పులివెందులను పసుపుమయం చేశారు. సీఎం సభకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఇవన్నీ చూసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతల్లో గుబులు పుట్టుకుంది.

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *