చిన్న పిల్లలకు పోస్ట్ మార్టం చేసేటప్పుడు.. ఇతను చెప్పిన మాటలు వింటే ఏడ్చేస్తారు

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

నిత్యం శవాలను దహనం చేసే కాటి కాపరి వృత్తి గురించి చెప్పగానే అమ్మో అంటూ నోరెళ్లబెట్టేస్తుంటాం.. ఇంతకంటే భయంకరమైన పని ఏదైనా ఉంటుందా అని ఆశ్చర్యపోతుంటాం.. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేచోట కట్టర్‌ అంటూ ఒకరుంటారని, తొలుత ఇతనే శవాన్ని కోస్తాడనే విషయం చాలా మందికి తెలియదు. ఇది ప్రభుత్వ ఉద్యోగమే అయినా, ఈ పని చేయడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. లేదంటే రాత్రిళ్లు శవాలు కలలోకి వచ్చి లేచి కూర్చుంటాయి.

Image result for modern post mortem photography

విధి నిర్వహణలో ఇప్పటి వరకు ఎన్నో శవాలు చూశాడు. పూర్తిగా కుళ్లిపోయి డీకంపోజ్‌ అయిన మృతదేహాలు, ఉరిపోసుకుని ఆత్మహత్య.. కిరోసిన్‌న్‌/పెట్రోలు పోసుకుని తగలబెట్టుకున్న వారి మృతదేహాలు, నాలుగైదు రోజుల పాటు సముద్రంలో ఉండిపోయి ఉబ్బిపోయిన మృతదేహాలు, రైలు ప్రమాదంలో ముక్కలు ముక్కలుగా తెగిపడిన

Image result for modern post mortem photography

మృతదేహాలు, రోడ్డు ప్రమాదంలో భయంకరంగా ఉన్న మృతదేహాలు.. ఇలా ఏ స్థితిలో ఉన్న మృత దేహం పోస్టుమార్టం కోసం వచ్చినా అతను భయం, అసహ్యం లేకుండా విధి నిర్వహణ పూర్తి చేసి డాక్టర్ల ప్రశంసలు పొందాడు.

విధి నిర్వహణలో భాగంగా 40 సంవత్సరాల కాలంలో 40 వేల శవాలను కోసేశాడు ఆ ఉద్యోగి!! 40 వేల శవాలకు పోస్టుమార్టం చేసిన ఆ ఉద్యోగికి ఇటీవలే

Image result for modern post mortem photography

సన్మానం చేశారు థానే మేయర్!!! ఉత్తరప్రదేశ్ అలీఘర్‌కు చెందిన బనారసి శ్యామ్‌లాల్ చౌట్టుల్(64) కుటుంబం 1973లో ముంబైకి

వలస వచ్చింది. శ్యామ్‌లాల్ తండ్రి, తాత థానే ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసేవారు. ఈ క్రమంలో శ్యామ్‌లాల్ కూడా వార్డు బాయ్‌గా రూ. 175 జీతంతో ఉద్యోగంలో చేరాడు. రెండేళ్ల తర్వాత మార్చురీ డిపార్ట్‌మెంట్‌కు షిఫ్ట్ అయ్యాడు.

విధి నిర్వహణలో భాగంగా నాటి నుంచి కొద్ది రోజుల క్రితం వరకు 40,000 శవాలకు పోస్టుమార్టం చేశాడు శ్యామ్‌లాల్. నెలకు కనీసం 700 డెడ్‌బాడీలకు శవ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపాడు. శ్యామ్‌లాల్ 2014లో పదవీ విరమణ

పొందినప్పటికీ.. ఆయన సేవలను మొన్నటి వరకు థానే ఆస్పత్రి ఉపయోగించుకుంది. ఇటీవలే థానే మేయర్ మీనాక్షి షిండే.. శ్యామ్‌లాల్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా శ్యామ్‌లాల్ మాట్లాడుతూ.. మృతదేహాల నుంచి వెలువడే దుర్గంధాన్ని ఒక్కోసారి భరించలేకపోయేవాళ్లమని తెలిపారు. ఈ క్రమంలో శవపరీక్ష కంటే ముందే తాను ఆల్కహాల్ తీసుకునే వాడినని చెప్పారు. దీనికి వైద్యుల అనుమతి ఉండేదన్నారు. చిన్న పిల్లలకు

 పోస్టుమార్టం చేసే సమయంలో పరిస్థితి క్లిష్టంగా ఉంటుంది, మనసును ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.2006లో థానే మున్సిపల్ ట్రాన్స్‌పోర్టు బస్సు చేనా బ్రిడ్జిపై నుంచి పడిపోవడంతో 32 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ సమయంలో ఉన్నతాధికారులు అత్యవసరంగా విధుల్లోకి పిలిచారని శ్యామ్‌లాల్ తెలిపారు. పగలు, రాత్రి కష్టపడి 32 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబాలకు డెడ్‌బాడీస్‌ను అప్పగించామని గుర్తు చేశారు.

Image result for modern post mortem photography

శ్యామ్‌లాల్ భార్య కూడా థానే ప్రభుత్వాసుపత్రిలో హౌస్‌కీపర్‌గా పని చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆమె ధైర్యం చెబుతూ.. సమస్యల్లో పాలుపంచుకుంటుందని తెలిపారు. తమ పిల్లలు కూడా అప్పుడప్పుడు మార్చురీకి వచ్చి వెళ్తుంటారని.. ఆ సమయంలో వారు కూడా బాధ పడుతుంటారని శ్యామ్‌లాల్ పేర్కొన్నారు.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *