చిట్టిబాబోళ్ల లచ్చిమి ఎంత సక్కగుందో..!

ప్రస్తుతం రానున్న బిగ్‌స్టార్స్‌ చిత్రాలలో ఎక్కువ మంది ఎదురుచూస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. 1985 కాలం నాటి గ్రామీణ వాతావరణం నేపధ్యంలో సాగే ఈ చిత్రం ఒక రకంగా ప్రయోగమనే చెప్పాలి. ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌లో లుంగీ కట్టి, గుబురు గడ్డంతో కనిపించి అభిమానులను ఆకట్టుకున్న రామ్‌ చరణ్, తర్వాత టీజర్‌ ద్వారా సౌండ్‌ ఇంజనీర్‌ చిట్టిబాబుగా బాగా ఆకట్టుకున్నాడు. ఆ వెంటనే హీరోయిన్‌ సమంత పాత్ర అయిన రామలక్ష్మి పాత్రను కట్‌చేసి రెండో టీజర్‌తో సుకుమార్‌ మాయ చేశాడు. తాజాగా ఈ చిత్రంలోని తొలిపాటను విడుదల చేశారు. ఎంతో కాలానికి ఆహ్లాదకరమైన గ్రామీణ పాటగా దీనికి అద్భుత స్పందన వస్తోంది. 

‘ఏరు శెనగ కోసం మట్టిని తవ్వితే, ఏకంగా తగిలిన లంకెబిందెలాగా, ఎంత సక్కగున్నావే’ అని సాగుతున్న ఈ పాటను పల్లెటూరి యువకుడు గ్రామంలోని తనకి నచ్చిన ఓ అందమైన అమ్మాయిని వర్ణిస్తూ పాడుతున్నట్లుగా ఎంతో బాగుంది. ట్యూనే కాదు.. లిరిక్‌లోని పదాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పాటకి చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించగా, దేవిశ్రీ ప్రసాద్‌ తనదైన ట్యూన్‌తో మొదటి పాటతోనే 100శాతం మార్కులు కొట్టేశాడు. ఇక సుకుమార్‌- దేవిశ్రీ ప్రసాద్‌ల అండర్‌స్టాడింగ్‌ తెలిసిన వారు ఇక వచ్చే పాటలతో కూడా దేవిశ్రీ తెలుగు సాహిత్య శ్రోతలకు వీనుల విందు చేయడం ఖాయమనే అంటున్నారు. 

మార్చి 30న విడుదలకు సిద్దమవుతోన్న ఈ చిత్రం మొత్తానికి ఇరగదీసిందనే చెప్పాలి. మరి వినడానికి ఇంతలా ఉన్న పాటను సుకుమార్‌ గోదావరి అందాల మధ్య ఎంత చక్కగా చిత్రీకరించి విజువల్స్‌తో కూడా మాయ చేయడం గ్యారంటీనే అని చెపాల్సిందే…! ఇక టైటిల్‌, ఫస్ట్‌లుక్‌, టీజర్స్‌ ద్వారా ఇప్పటికే అంచనాలను పెంచుకున్న ఈ చిత్రం పాటల ద్వారా మరిన్నిఅంచనాలకు కేంద్రబిందువు కావడం ఖాయమంటున్నారు. 

Click Here For Rangasthalam 1ST Song

Source From: http://www.cinejosh.com/rss-feed/0/telugu.html

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *