కేంద్రానికి మే దాకా గడువు సాయం రాకపోతే విడాకులే!

2018 మే వరకు చూస్తారు చంద్రబాబు. ఏపీకి విభజన చట్ట ప్రకారం అందాల్సిన సాయం కేంద్రం నుంచి వస్తే సరే సరి. రాని పక్షంలో బీజేపీతో తెగతెంపులు ఖాయం అంటున్నారు పరిశీలకులు. మే వరకు ఎందుకు చూడటం అంటే.,,అప్పటికి ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంటుంది. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటానికి నాలుగేళ్లు సమయం ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. చంద్రబాబు ఎంతో ఓర్పును ప్రదర్శిస్తూ వచ్చినట్టే చెప్పుకోవాలి. ఇంకా ఎదురు చూపులు చూస్తే జనం టీడీపీని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. నాలుగేళ్ల ఢిల్లీ చుట్టూ తిరిగినా పాపం కనికరించలేదనే సానుభూతి ప్రజల్లో వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్‌పై ఎంత కోపం ఉందో బీజేపీ పైనా అంతే ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు.

అలాగే మే నెలలోపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దక్షిణాదిలో బీజేపీ భవితవ్యం, ఓవరాల్‌గా బీజేపీకి ప్రజల నాడి కొంత ఈ ఎన్నికల్లో తెలుస్తుంది కాబట్టి మే నెలలో ఒక డెసిషన్‌ తీసుకోవటానికి పరిస్తితులు అనుకూలం అని భావన. ఎన్డీయే నుంచి బయటకు వస్తే… రాష్ట్రానికి అందుతున్న కొద్దిపాటి సాయం కూడా అందదనే ఉద్దేశంతోనే తాను బీజేపీతో కలిసి ముందుకు సాగుతున్నానని చంద్రబాబు అంతరింగులతో చెబుటూంటారు. ఒకవేళ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సి వస్తే చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకొళ్లే అవకాశాలు ఉన్నాయి. టీడీపీతో కలిసి ఏపీకి ఏమీ చేయలేకపోయిన బీజేపీ… వైసీపీతో కలిసి రాష్ట్రానికి ఏదో చేస్తామని హామీ ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని… అప్పుడు బీజేపీతో పాటు ఆ పార్టీతో జతకట్టబోయే పార్టీ కూడా రాజకీయంగా నష్టపోవాల్సి ఉంటుందని చంద్రబాబు అంచనా. అప్పుడు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఏం జరుగుతుందో ఇంకొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది.


Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *