కార్పోరేట్లు ఏపీని ఎలా చూస్తారు అనటానికి ఇదే ఉదాహరణ..!

భారత ఆటోమొబైల్‌ రంగంలో అశోక్‌ లే ల్యాండ్ కంపెనీ కూడా ఓ భారీ లారీ లాంటిదే. నవ్యాంధ్ర కేంద్రంగా, చంద్రబాబుపై నమ్మకంతో తెలంగాణను కాదని ఏపీకి వచ్చి వచ్చే నెల నుంచే కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. విజయవాడ పరిధిలోని మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో బాడీ బిల్డిండ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం ‘అశోక్‌ లే ల్యాండ్‌’ ముందుకొచ్చింది. మార్చి నెలలో భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించటానికి కంపెనీ ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించి, ఆయన చేతులమీదుగా భూమి పూజ జరిపించాలని నిర్ణయించారు.

అశోక్‌ లేలాండ్‌ స్థాపిస్తున్న యూనిట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 ఎకరాల భూములకు కేటాయించింది. ఎకరానికి రూ.16.50 లక్షల చొప్పున మొత్తం రూ.12.37 కోట్లను ఏపీఐఐసీకి.. అశోక్‌ లేలాండ్‌ చెల్లించింది. దీంతో ఏపీఐఐసీ అధికారులు కొద్దిరోజుల కిందట ఈ సంస్థతో సేల్‌డీడ్‌ రాసుకున్నారు. అశోక్‌ లేలాండ్‌ పనులుచేపట్టి వాటిని పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువచ్చిన తర్వాతే, పూర్తిస్థాయిలో ఈ స్థలాన్ని దానికి రిజిస్ర్టేషన్‌ చేస్తారు. అశోక్‌లేలాండ్‌ సంస్థకు ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు! అందువల్లనే మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌ను ప్రకటించాక, అందరికంటే ముందుగా ఈ సంస్థే స్పందించింది. దాదాపుగా ఏడాది కిందటే విజయవాడలో బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మల్లవల్లి అందుకు అనుగుణంగా ఉండటంతో ఇక్కడ 100 ఎకరాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ఆ తరువాత 75 ఎకరాలు సరిపోతాయని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఆ సంస్థకు భూములు కేటాయించింది. నిజానికి ఈ భారీ పరిశ్రమ తెలంగాణలో పెట్టాలని మొదట డిసైడ్‌ అయిపోయింది. ఎంఓయూ కూడా కేసీఆర్‌తో చేసుకుంది. కానీ మనసు మార్చుకుని ఏపీ వచ్చేసింది. బాబుపై ఉన్న విశ్వాసం కేసీఆర్‌పై లేకనో ఏమో వారికే తెలియాలి. ఏదిఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ఎవరినైనా అమ్మనాబూతులు తిట్టమనండి. అందులో కేసీఆరే తోపు. సెంటిమెంట్ రగిలించటంలో ఛాంపియనే. రాజకీయ లబ్ది పొందేలా నిర్ణయాలు తీసుకోవటం లోనూ కేసీఆర్‌ టాపరే. కానీ వీటితో తెలంగాణకి ఏం లాభం? ఇదే కేసీఆర్ ని డెవలప్ మెంట్ ప్లాన్ డిసైడ్ చేయమనండి … ఇండస్ట్రీని ఆకట్టుకోమనండి… అంతర్జాతీయ వేదికపై ఇదీ తెలంగాణ అంటూ ఆవిష్కరించమనండి ! మొన్న జీయిఎస్ సదస్సులో లటక్కన స్పీచ్ చదివి వెళ్లిపోయినట్టే ఉంటది వ్యవహారం !

అశోక్‌ లేల్యాండ్ 2016 అక్టోబర్ లోనే కేసీఆర్‌తో ఒప్పందం చేసుకుంది. మెదక్ జిల్లా జిన్నారం దగ్గర ప్లాంట్ పెట్టాలని ప్లాన్. కానీ తర్వాత తెలంగాణ వైపు నుంచి స్పందన రాలేదో… వచ్చినా నచ్చలేదో లేట్ అవుతోంది అనుకున్నారు. తీరా చూస్తే అశోక్ లేలాండ్ ఏపీలో తేలింది. ఏంటి అని ఆరా తీస్తే ఏపీ ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల పాలసీ, అన్నిటికీ మించి ఫాలోఅప్ చేసే పద్ధతి అన్నీ నచ్చాయ్. చంద్రబాబు ది బెస్ట్ అనేసింది ఆ సంస్థ. ఇదే పాయింట్ పట్టుకొని… తెలంగాణతో ఎంగేజ్‌మెంట్‌… ఏపీతో పెళ్లా అంటూ అక్కడి మీడియా హోరెత్తించింది. ఇదేదో వెయ్యి కోట్ల ప్లాంటుకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉంటాయ్… బ్రాండింగ్ ఏంటి … ఏ రాష్ట్రాన్ని ఎలా చూస్తోంది కార్పొరేట్ ఇండియా అనేది ఇక్కడ పాయింట్‌.

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *