‘కన్ను కొట్టి ఇండియా గుండె కొల్లగొట్టిన’ మళయాల కుట్టి సినిమా అఫిషయల్ టీజర్ (వీడియో)

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

ప్రియా ప్రకాష్ వారియర్.. అదేనండీ కన్నుకొట్టి… ఇండియా గుండె కొల్లగొట్టిన పిల్ల. ఈ ఏడాది వాలెంటైన్స్ డే కి ఇండియా మొత్తానికి నచ్చేసి నెచ్చెలి అయిపోయింది ఈ మలబార్ గాళ్. కనీసం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా ఈ మలయాళీ పిల్ల ఇపుడు పే..ద్ద సెలబ్రిటీ అయిపోయింది. కుర్రకారు గుండెలు ఒక్క చూపుతో బద్దలు కొట్టిన ఆ అమ్మాయి… సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫామ్స్ లో ట్రెండింగ్ అయిపోయింది. ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్… అంతగా నచ్చేశాయి మరి.

‘ఒరు అధార్ లవ్’పేరిట మలయాళంలో హైస్కూల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఓ సినిమా వస్తోంది. నిజానికి ఇది చాలా చిన్న సినిమా… కానీ ప్రియా ప్రకాష్ వారియర్ డిఫరెంట్ స్టయిల్ లో కన్నుగీటి నేషనల్ లెవల్ ఫేమస్ చేసేసింది. వాలంటైన్స్ డే సందర్భంగా మూవీ ప్రమోషనల్ వీడియో సాంగ్ ను రీసెంట్ గా విడుదల చేశారు. భారతదేశంలో నెటిజన్లంతా దాదాపుగా ఈ వీడియోను చూసేశారు. కొందరయితే ఇప్పటికి నాలుగు ఐదు సార్లకు తగ్గకుండా చూసేశారు. ఇక కుర్రకారు అయితే ఆ పిల్ల ఇమేజ్ ను డీపీగా మార్చేసుకున్నారు. దాదాపు నాలుగు నిమిషాలున్న ఆ వీడియోలో… కేవలం 26 సెకండ్స్ బిట్… దేశాన్ని ఊపేసింది. అబ్బాయి ఫ్లర్ట్ చేస్తే… దాన్ని మించిన ఫ్లర్ట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేసింది ప్రియా ప్రకాష్. ఓ వారియర్ లా తన ఓర చూపు బుల్లెట్లతో … కుర్రకారు గుండెలు బ్లాస్ట్ చేసేసింది. కన్ను కొట్టి.. నిద్రలేకుండా చేసేస్తోంది.

ఆ పాటలో అందులో…ఆమె సహజసిద్ధంగా ఇచ్చిన హావభావాలకు ఎవరు మాత్రం పడిపోకుండా ఉండగలరు. అందుకే.. ప్రియా ప్రకాశ్ ను.. Crush Of India అని పిల్చుకుంటున్నారు. ఇప్పుడు ఒరు ఆధార్ లవ్ సినిమా అఫిషియల్ టీజర్ వచ్చింది. వచ్చిన కొన్ని గంటల్లోనే 30 లక్షల వ్యూస్ రావడంతో ఇప్పుడు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో నడుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ టీజర్ ను మీరూ కింద క్లిక్ చేసి చూసేయండి…

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *