ఏప్రిల్‌లో రాజీనామాల బండారం బట్టబయలు లీక్‌ చేసిన వైసీపీ కీలక నేత

ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరిగితే వైసీపీ చిత్తుగా ఓడిపోతుందని జగన్‌కి కూడా తెలుసని, ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో నంద్యాలలో భంగపడ్డాం అని మరోసారి ఉప ఎన్నికలు పేరుతో మరో నంద్యాల తరహా సీన్‌లను మనం రిపీట్‌ చేసే అవకాశం టీడీపీకి ఇవ్వకూడదని జగన్‌, విజయసాయి అందరికీ చెప్పారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. చూడటానికి మనం ప్రజల దృష్టిలో రాజీనామాలు చేసినట్టు కనిపించాలి. కానీ ఉప ఎన్నికలు జరగకూడదు. మనం ఓడే పరిస్తితి రాకూడదు. అలాంటి ఆలోచన ఏదైనా చెప్పండి అంటే బీజేపీ వర్గాల నుంచి వచ్చిన సలహా ప్రకారం ముందుకు వెళుతున్నట్టు వైసీపీ నేత లీక్ చేశారు.

ప్రత్యేక హోదాపై కేంద్రం స్పందించకపోతే ఏప్రిల్‌ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ ప్రకటన వెనుక బండారాన్ని ఓ వైసీపీ ముఖ్య నేత ఆఫ్‌ ది రికార్డుగా ఢిల్లీలో బయట పెట్టేసారు. జగన్‌కు దమ్ముంటే ఇవాళే ఎంపీలతో రాజీనామాలు చేయించాలని చాలామంది సవాళ్లు విసురుతున్నారని జగన్ అంత తెలివి తక్కువ వాడు కాదని ఆ నేత సమర్థించుకున్నారు. జగన్‌కి ఉండే వ్యూహాలు జగన్‌కి ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ వైసీపీ నేత బయటపెట్టిన విషయాలు చూస్తే జగన్ నిజస్వరూపం ఏంటో అర్థం అవుతోంది. లేస్తే మగాడిని కాను అని వెనకటికి ఓ అసమర్థుడు సవాళ్లు విసిరినట్టు జగన్‌ చేస్తున్న ఛాలెంజ్‌లు బీజేపీతో డూప్‌ ఫైటింగేనని ఏపీ ప్రజలకు అర్థం అయిపోయింది. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు అని లేఖలు పంపితే అవి ఎలాగూ రిజెక్టు అవుతాయి. మళ్లీ వాళ్లకి స్పీకర్‌ ఫార్మెట్లో పంపితేనే ఆమోదిస్తారు.

అది కూడా పార్లమెంటు సమావేశాల చివరి రోజు ఏప్రిల్‌ 6న రాజీనామాలు చేస్తే ఒక్కో ఎంపీని ఆ లేఖపై స్పీకర్‌ విడిగా పిలిచి మాట్లాడాలి ప్రొసీజర్ ప్రకారం. ఈ లెక్కన రెండు నెలలు పడుతుంది. అంటే జూన్‌ వరకు ప్రక్రియ కొనసాగుతుంది. జూన్‌లో ఆమోదించినా కూడా ఏడాదిలోపు సార్వత్రిక ఎన్నికలు ఉన్నట్టయితే ఉప ఎన్నికలు పెట్టరు. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పార్లమెంటు ఎన్నికలు దేశమంతటా జరుగుతాయి కాబట్టి ఈలోపు ఈ ఎన్నికలు జరగవు. ఓడిపోతానని, తన గాలి పోతుందనే భయం కూడా ఉండదు. ఇది జగన్‌ నేలబారు, చీప్‌ ఎత్తుగడ. ఇవన్నీ చర్చించే ఏప్రిల్‌ 6 గడువు పెట్టుకున్న విషయం వైసీపీ వర్గాలు బయట పెట్టాయి.

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *