ఎన్సారైతో పెళ్లి.. 45రోజుల కాపురంలోనే భార్యకు షాకిచ్చిన భర్త!!

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

ఎన్నారై భర్తల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఓ మహిళ పోరాటమే మొదలుపెట్టింది. తనకు జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడదని ఆమె కోరుతోంది. ఏకంగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కి ఆమె లేఖ కూడా రాసింది. చాంద్ దీప్ కౌర్(29)

అనే మహిళ తన భర్త రమణ్ దీప్ సింగ్‌పై కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకున్న తర్వాత 45 రోజులకే అతడు న్యూజిలాండ్ వెళ్లిపోయాడని అప్పటినుంచి తాను అత్తవారింట్లోనే ఉంటున్నానని ఆమె చెబుతోంది. వెంటనే తన భర్తను

ఇండియా రప్పించాలని ఆమె కోరుతోంది. పెళ్లి చేసుకున్న 45 రోజులకే తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడనీ, అప్పటి నుంచి ఒక్కసారి కూడా తనతో కనీసం మాట్లాడలేదని చెబుతోంది. చండీగడ్ పోలీసులు అతడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.

తనను న్యూజిలాండ్ తీసుకెళ్లడం లేదని అలాగే అత్త, ఆడపడుచులు తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకుని పట్టించుకోకుండా పారిపోయిన ఎన్నారైలకు బుద్ధి చెప్పాలని కౌర్ కోరుతోంది. తన భర్తను వెంటనే ఇండియా రప్పించాలని, అతడి

పాస్‌పోర్టును కూడా రద్దు చేయాలని ఆమె కోరుతోంది. తన భర్తను న్యూజిలాండ్ దేశం బహిష్కరించేలా అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని విన్నవించుకుంటోంది.

తన భర్త రమణ్ న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడని ఆమె తెలిపింది. అతడితో తనకు విడాకులు ఇప్పించాలంటోంది. అంతేకాదు తనలా ఎన్నారై భర్తల

చేతుల్లో మోసపోయే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలంటోంది. తన భర్తకు మాత్రం తగిన బుద్ధి చెప్పేందుకు తాను సిద్దంగా ఉన్నానని కౌర్ తెలిపింది. ఇప్పటికే అతడిపై లుక్‌అవుట్ నోటిస్ ఇష్యూ అయింది. కోర్టు నోటీసులు కూడా పంపింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు.

Loading…


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *