ఎన్టీఆర్ బయోపిక్ మ్యాటరేదమ్మా..!

దాదాపు నెల రోజుల క్రితం ఎన్టీఆర్ మీద తీసే బయోపిక్ ల హడావిడి విపరీతంగా వినిపించినా.. ప్రస్తుతం ఇది తగ్గినట్లుగానే అనిపిస్తుంది. మొన్నామధ్యన తేజ – బాలకృష్ణ కలయికలో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి, రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండు, కేతిరెడ్డి లక్ష్మీస్ వీరగ్రంధం మూడు, తుమ్మలపల్లి ఎన్టీఆర్ బయోపిక్ నాలుగు సినిమాల హడావిడి మాములుగా లేదు. ఏ ఛానల్ లో చూసినా.. ఏ వెబ్సైట్ లో చూసినా… సోషల్ మీడియాలోనూ అదే హడావిడి. అసలు ఎన్టీఆర్ జీవిత కథ మీద ఇంత రచ్చ జరగడానికి ఒక విధంగా రామ్ గోపాల్ వర్మ కారణం. ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మీడియాలో రచ్చ రచ్చ చేశాడు. 

ఇక తేజ కూడా తాను బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నట్టుగా చెప్పుకున్నాడు. కానీ బాలకృష్ణ మాత్రం ఎక్కడా క్లారిటీ ఇవ్వనేలేదు. ఇక ఇప్పుడు తేజ, వెంకీ సినిమాతోనూ, బాలయ్యబాబు కె ఎస్ రవికుమార్ జై సింహాతో బిజీగా వున్నాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ చర్చ ప్రస్తుతానికి లేదు. ఇక వర్మ కూడా నాగార్జున తో చేసే సినిమాతో బిజీగా వున్నాడు. ఆ సినిమాకి కనీసం ఆరునెలలు పడుతుంది. ఈ లోపు లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మాట్లాడితే నాగార్జున ఊరుకోడు. ప్రస్తుతం అందుకే సైలెంట్ అయ్యాడు వర్మ. మరోపక్క కేతిరెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథాన్ని.. వర్మ కనుక లక్ష్మీస్ ఎన్టీఆర్ ని వదిలేస్తే తాను వదిలేస్తానంటున్నాడు.

ఇక తుమ్మలపల్లి  రామసత్యనారాయణ అయితే.. ఆయన ఎందుకు ఎన్టీఆర్ బయోపిక్ గురించి చర్చించాడో ఆయనకే పూర్తిగా తెలియదు. ఇక తేజ.. ఎన్టీఆర్ బయోపిక్ ని ఎన్టీఆర్ వర్ధంతి రోజున మొదలెడతామన్నారు గాని బాలకృష్ణ మాత్రం ఎక్కడా ఆ ఊసే ఎత్తడం లేదు. ఇక వర్మ కూడా ఫిబ్రవరిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్నాడు  అది ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. ఇక కేతిరెడ్డి ఏదో లక్ష్మీస్ వీరగ్రంధం అంటూ ఎన్టీఆర్ ఫోటోని పట్టుకుని కాస్త హడావిడి చెయ్యడం తప్పితే.. ఎన్టీఆర్ బయోపిక్ మీద ఇప్పుడు మాత్రం ఎలాంటి హడావిడి లేదు. అందుకే హడావిడి అంతా నీరుగారిపోయిందంటున్నారు జనాలు.

Source From: http://www.cinejosh.com/rss-feed/0/telugu.html

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *