ఈ రోజు 15-02-2018 రాశి ఫలితాలు మీకోసం

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

మేషం
నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విద్యార్థులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్పెక్యులేషన్ లాభదాయకం. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు.

రాశి లక్షణాలు వృషభం
ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల రాకవల్ల మీలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. కుటుంబీకుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. వ్యాపారాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బహుమతులు అందుకుంటారు.

రాశి లక్షణాలు మిథునం
తరచూ సభలు, సమావేశాలలో పాల్గొంటారు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కార్యసాధనలో జయం పొందుతారు.

రాశి లక్షణాలు కర్కాటకం
ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఇంక్రిమెంటు లాంటి శుభవార్తలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు ఆశాజనకం. సంతానంపట్ల అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. స్త్రీలకు బంధువులు, చుట్టుప్రక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూర, చిరు వ్యాపారస్తులకు లాభదాయకం.

రాశి లక్షణాలు సింహం
ప్రింటింగ్ రంగాల్లోని వారికి అచ్చుతప్పులు దొర్లటంవల్ల పై అధికారుల చేత మాటపడాల్సి వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబంలో ఒకరి ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. ఖర్చులు అధికం అవుతాయి. ఆహారంలో పరిమితి పాటించండి. ముఖ్యులతో కలిసి సమావేశాలు జరపుతారు.

రాశి లక్షణాలు కన్య
ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. రుణ విముక్తులు కావటంతో మానసికంగా కుదుటపడతారు. వృత్తి వ్యాపారుల మధ్య నూతన స్నేహం ఏర్పడుతుంది. అనుకోని కారణాలవల్ల ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులవల్ల చికాకులు ఎదురవుతాయి.

రాశి లక్షణాలు తుల
పత్రిక, ప్రైవేటు రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోతారు.

రాశి లక్షణాలు వృశ్చికం
చేతివృత్తుల వారికి సామాన్యంగా ఉంటుంది. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు. ఒప్పందాలు, హామీల విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. అధికారుల మన్ననలు పొందగలుగుతారు. శతృవులపై విజయం సాధిస్తారు. పాత మిత్రులు, ప్రముఖులతో చర్చలు జరుపుతారు. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది.

రాశి లక్షణాలు ధనస్సు
ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతోపాటు కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలలోని వారికి పురోభివృద్ధి చేకూరుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి.

రాశి లక్షణాలు మకరం
ఫ్యాన్సీ, బంగారం, వెండి, లోహ, రత్న వ్యాపారస్తులకు సంతృప్తి, పురోభివృద్ధి. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయమవుతుంది. గృహ మరమ్మత్తులు, నిర్మాణాలు చేపడతారు. సభలు, సమావేశాలలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

రాశి లక్షణాలు కుంభం
మీ శ్రీమతి సలహా పాటించటంవల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. మిత్రులలో ఒకరి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించగలుగుతారు. సంఘంలో గొప్ప గుర్తింపుల, రాణింపు లభిస్తుంది. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపీ పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక జరుగును.

రాశి లక్షణాలు మీనం
స్త్రీలకు తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు సంతృప్తి, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. బిల్లులు చెల్లించగలుగుతారు. ముఖ్యమైన విషయాలలో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాలలోని వారు పై అధికారుల చేత మాటపడక తప్పదు.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *