ఈ రోజు 14-02-2018 రాశి ఫలితాలు మీకోసం

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

మేషం
మేషం : నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. స్త్రీలకు షాపింగ్‌ల కోసం ధనం వెచ్చిస్తారు. మీ లక్ష్య సాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషిచేయండి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి.

రాశి లక్షణాలు వృషభం
వృషభం : ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరాత్రా చికాకులు తప్పవు. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధ వహించండి. హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. తలపెట్టిన పనులు ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యపడదు. వైద్యులు అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తారు.

రాశి లక్షణాలు మిథునం
మిథునం : స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు సదావకాశాలు లభించినా ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు.

రాశి లక్షణాలు కర్కాటకం
కర్కాటకం : బ్యాంకు రుణాలు తీరుస్తారు. సోదరీ సోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి శుభదాయకం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు ఒత్తిడి చికాకులు తప్పవు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.

రాశి లక్షణాలు సింహం
సింహం : ఉద్యోగరీత్యా ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. పాత మిత్రుల కలయికతో గతానుభవాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీల లక్ష్య సాధనకు ముఖ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి.

రాశి లక్షణాలు కన్య
కన్య : మీ శ్రీమతి సలహా పాటించడం శ్రేయస్కరం. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. స్త్రీల ఉద్యోగయత్నం లభిస్తుంది. విద్యార్థుల తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు తప్పవు. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. బంధువుల రాకతో పనులు హడావుడిగా ముగిస్తారు. ఊహించని పెద్ద ఖర్చు తగిలే అస్కారం ఉంది.

రాశి లక్షణాలు తుల
తుల : క్రీడ, కళ, సాంస్కృతి రంగాల పట్ల ఆసక్తి చూపుతారు. రాబడికి మించి ఖర్చులుంటాయి. హోదాలో ఉన్న అధికారులకు ఆకస్మిక స్థాన చలనం తప్పదు. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. విద్యుత్ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. స్త్రీలు, అదనపు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు.

రాశి లక్షణాలు వృశ్చికం
వృశ్చికం : ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చు తప్పులు దొర్లుట వల్ల పై అధికారుల చేత మాటపడాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అదుపు చేయాలన్న మీ ఆశయం నెరవేరదు. ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బందిపడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

రాశి లక్షణాలు ధనస్సు
ధనస్సు : విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలు షాపింగ్ కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లో అయిన వారి క్షేమసమాచారం సంతృప్తినిస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం.

రాశి లక్షణాలు మకరం
మకరం : సేల్స్ సిబ్బందితో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు తోటివారితో అనునయంగా మెలగాలి. ఆత్మీయుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడుతారు. ప్రైవేట్ ఫైనాన్స్, చిట్స్ సంస్థల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. మీ సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి.

రాశి లక్షణాలు కుంభం
కుంభం : చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. పాతమిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో నాణ్యత లోపం వల్ల నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.

రాశి లక్షణాలు మీనం
మీనం : ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్నేహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల పట్ల ఓర్పు, నేర్పు, వ్యవహరించవలసి వస్తుంది. కుటుంబీకులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. రాజకీయాలలోని వారు ఆచితూచి వ్యవహరించవలెను.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *