ఇదిగో అమరావతి వైభవం.విజయదశమికి శంకుస్థాపన

విజయదశమి రోజు శంకుస్థాపన జరిగే భవన నిర్మాణాలు ఇవే. హైకోర్టు భవంతి నిర్మాణ ప్రణాళిక, ఆకృతిపై ముఖ్యమంత్రికి ఫోస్టర్ బృందం ప్రెజెంటేషన్ ఇచ్చింది. రాజధానిలో పరిపాలన నగర నిర్మాణ ప్రణాళిక, ఆకృతులపై సచిత్రంగా, సవివరంగా నిర్మాణాల ప్రత్యేకతలను ఆర్కిటెక్టులు విశదీకరించారు.

వజ్రాకృతిలో రూపొందించిన శాసనసభ భవంతి నిర్మాణ ప్రణాళికపై సీఎం లేవనెత్తిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. హైకోర్టు బాహ్య ఆకృతి అత్యద్భుతంగా, ప్రపంచానికే తలమానికంగా ఉండాలి. లోపల తమకు ఎటువంటి సౌకర్యాలు వుండాలో, అంతర్గత భవంతి నిర్మాణ శైలి ఎలా ఉండాలో న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండని సీఎం చెప్పారు. ప్రపంచం మెచ్చే రాజధానిని నిర్మిస్తున్నామన్నది ఆర్కిటెక్టులు గుర్తుంచుకోవాలని సీఎం గట్టిగా చెప్పారు.

  

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *