ఆపండెహే..మీ పంచాయతీ టీడీపీ-బీజేపీ వార్‌పై బాబు గరం

మోడీ ఒక టీ అమ్ముకునే వాడు అని కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ సింపతీ కోసం వాడుకున్నట్టే మాణిక్యాలరావు కూడా అవును నేను ఫోటోగ్రాఫర్‌నే, రోడ్లపై టీ తాగుతాను అంటూ ఇమిటేట్‌ చేస్తున్నారు. కానీ తాడేపల్లిగూడెం వీధి గొడవను తీసుకు వచ్చి రాష్ట్ర సమస్యగా చేస్తున్న ఇరు పక్షాలకు సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఓ పక్క దేశ స్థాయిలో ప్రధానితో మాట్లాడుతూ కలిసి పనిచేస్తుంటే ఈ చిల్లర పంచాయతీలు ఏంటని అసహనం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-బీజేపీ నేతల వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు.

జెడ్పీ చైర్మన్‌ బాపిరాజు, మున్సిపల్‌ చైర్మన్‌ వ్యాఖ్యలపై ఆరా తీశారు. ఇరుపార్టీ నేతల మధ్య నెలకొన్న వివాదంపై టీడీపీ సీనియర్ నేతలతో చర్చించారు. ఈ వివాదంపై విచారణకు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, వర్మతో కమిటీ నియమించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు. రాష్ట్రమంతటా వైసీపీని ప్రతిపక్షంగా చూస్తుంటే.. ఇక్కడ తెలుగుదేశం నాయకుల వింత వైఖరితో తమను ప్రతిపక్ష పార్టీగా చూస్తున్నారని బీజేపీ నేత, దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకుడు, మునిసిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ మంత్రి మాణిక్యాలరావుని ఆఫ్ట్రాల్‌ ఫొటోగ్రాఫర్‌ అని కామెంట్‌ చేస్తున్నారని బీజేపీ వాళ్లు అంటున్నారు. ఆ విమర్శలకు మంత్రి కూడా “అవును నేను ఫొటోగ్రాఫర్‌గానే వచ్చాను. పుట్టుకతో కోటీశ్వరుడిని కాదు. ప్లాట్‌ఫారంపై ఆగి టీ తాగుతాను. స్టార్‌ హోటల్‌ అంటే నాకు తెలియదు’ అని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఇకపై వారం వారం మీడియా ముందుకు వచ్చి ఏ పని ఎందుకు ఆగిందో చెబుతానని తెలిపారు.


Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *