ఆంధ్రా పాలిట దరిద్రం కేంద్రం కమలం పార్టీకి కాలం తీరుతోంది

కుతంత్రాల కాంగ్రెస్‌ను ఆంధ్ర ప్రజలు సమాధి చేశారు. మళ్లీ ఇప్పట్లో లేవాల్సిన పని లేకుండా. కాంగ్రెస్‌కు భిన్నం తాము అన్నందుకు కమలాన్ని కనీసం వికసించనిచ్చారు. కానీ ప్రస్తుతం ఏపీకి కేంద్రం దరిద్రంలాగా తగులుకుంది. కమల కుతంత్రంతో త్రిశంకు స్వర్గంలో ఆంధ్రా అల్లాడుతోంది. పోగాలానికి ముందు కాంగ్రెస్స్ ప్రకటించి పోయిన ప్రత్యేక హోదాను ప్రణాళికా సంఘ రద్దు చేసింది అని, నీతి అయోగ్ వద్దు అందని, ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్నట్టు ప్రత్యేక ప్యాకేజీ అని ఊరించి ఇప్పటివరకు ఆ ఊసే లేకుండా చేసింది కాలం తీరబోయే కమలం పార్టీ.

అంతటితో ఆగారా? అప్పుడో ఇంకో మాట కూడా అన్నారు త్వరలో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కూడా ఆ హోదా రద్దు చేస్తాము అన్నారు. సీఎస్‌టీ మినహాయింపును 10 ఏళ్ల పాటు పునరుద్దరిస్తూ ప్రత్యేక హోదా పదాలు వాడుతూ సిక్కింకు బడ్జెట్ సాయంగా రూ.27,413 కోట్లు ఇస్తూ ఆమోదించిన కేంద్ర ప్రభుత్వ మంత్రి మండలి ప్రతి ఇది.

విభజించినప్పుడు రెవిన్యూ లోటు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వము పొమ్మంటున్న దగాకోరు కేంద్రంను ఇంకా భరిద్దామా? చాకిరేవు సౌజన్యంతో.

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *