ఆంధ్రాపై కుట్ర జరుగుతోందా? మోడీ ఓ మేడిపండని తేలుతోందా?

మేడిపండు చూడ మేలిమై యుండు పొట్టవిప్పి చూడ పురుగులుండు బిరికి వాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ..! వినుర వేమ..! మేడిపండు పై భాగాన్ని చూస్తే… మంచి రంగుతో నోరూరించేలాగా కనిపిస్తుంది. కాని దాని పొట్టను విడదీసి చూస్తే లోపల పురుగులుంటాయి. అలాగే పిరికి వాడి ధైర్యం కూడా పైన పటారం లోన లొటారం లాగా ఉంటుందని ఈ పద్యం యొక్క భావం. రాష్ట్రం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ వైఖరి అలాగే ఉంది. దానిని అసూయ అనాలా? ద్వేషం అనాలా?


ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్టాన్ని ఆమోదానికి ఎందుకని అన్ని రకరకాల మెలికలు పెడుతోంది కేంద్రం? ఏపీ అసెంబ్లీ ఆమోదించిన భూ సేకరణ చట్టం ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం మనల్ని ముప్పతిప్పలు ఎందుకు పెట్టాల్సి వస్తోంది ? గత ఆరు నెలలుగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లు ఆమోదానికి రకరకాల కొర్రీలు పెడుతూ రాష్ట్రాన్ని మోడీ సర్కార్‌ సతాయించటం వాస్తవం కాదా?

గుజరాత్‌, తెలంగాణ తరహాలోనే ఏపి ప్రభుత్వ బిల్లు ఉన్నా ఆ రెండు రాష్ట్రాల బిల్లులను కొంపలు మునిగిపోయే అంత వేగంగా ఆమోదించిన కేంద్ర ప్రభుత్వానికి ఏపి విషయంలోనే ధర్మ సందేహాలు ఎందుకు తలెత్తాయి. గుజరాత్‌, తెలంగాణ పేర్కొన్న సెక్షన్లతోనే ఏపీ బిల్లు ఉన్నా వాళ్లకి లేని కొర్రీలన్నీ ఏపీకి ఎందుకు వేస్తున్నారు. జగన్‌తో దోస్తీ కోసమా? గుజరాత్‌ని దాటకూడదనా? చంద్రబాబు మోడీకంటే దూసుకుపోతున్నాడనా? ఏపీ వృద్ధిరేటు కేంద్రం కంటే ఎక్కువ నమోదు అవుతోందనా? మోడీ లాగా మాటలు గొప్ప ప్రసంగాలు పిట్టకథలు రాని చంద్రబాబు పనిలో మాత్రం కేక పుట్టిస్తున్నారనా? ఏపీ ప్రభుత్వ భూసేకరణ బిల్లును గతంలో ఎన్నడూ లేని రీతిలో వ్యవసాయ శాఖ ఆమోదానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎందుకని పంపించింది.

FILE PHOTO: Indian Prime Minister Narendra Modi gestures during a session of the St. Petersburg International Economic Forum (SPIEF), Russia, June 2, 2017. REUTERS/Mikhail Metzel/TASS/Host Photo Agency/Pool/File Photo

జాప్యం చేయటానికా? ఏపీలో జరిగే అభివృద్ధిని ఆపటానికా? పోలవరం ప్రాజెక్టుపై కక్షకట్టారా? పరిశ్రమలు, విమానాశ్రయాలకు భూములు ఇవ్వకుండా ఆపుతారా? ఏపీ రాజధానికి ఇంకా కొన్ని గ్రామాలు భూములు ఇవ్వాలి. దానిని ఆపే ప్రయత్నమా? గుజరాత్‌, తెలంగాణ బిల్లుల వల్ల రాని ఆహారభద్రత సమస్య ఏపీకే ఎందుకు వచ్చిందో చెబుతారా? ఏపీ ప్రభుత్వం తయారు చేసిన బిల్లు ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని, మొత్తం నిబంధనలకు విరుద్దం అని హోం శాఖకు కేంద్ర వ్యవసాయ శాఖ పంపటం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజక్టులన్నీ పూర్తి చేసి కొత్తగా 12 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి తీసుకొస్తున్నట్లు సమాధానం చెప్పినా ఏపీ ప్రభుత్వం గోడు ఎందుకు పట్టించుకోవటం లేదు? భూసేకరణ చట్టానికి సవరించిన ప్రతిపాదన వల్ల రాష్ట్రంలో ఆహార భద్రతకు ఎటువంటి ప్రభావం ఉండదు అని తెలిపినా ఎందుకు కన్విన్స్ అవట్లేదు?


రాష్ట్రంలో ఉన్న బహుళ పంటల్లో 40 శాతం పైగా భూములను వరిసాగు కోసమే ఉపయోగిస్తున్నారు. దీనికి తోడు భారీ, మధ్యతరహా ప్రాజక్టులను పూర్తి చేసి ఇప్పటి వరకు సాగుయోగ్యం లేని 12 లక్షల హెక్టార్ల భూమిని కొత్తగా సాగులోకి తెస్తున్నట్లు వివరించినా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? కొత్తగా సాగులోకి తీసుకురావాలనుకుంటున్న 12 లక్షల ఎకరాల భూమిని ఎక్కడెక్కడ, ఎంత తీసుకొస్తారో, కొత్త ఆయకట్టు ఎంత వరకు సాధ్యమో ఏపీ చెప్పాలంట. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనాటికి ఎంత సమయం పడుతుందో… అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీని వెనుక ఏ శక్తులు ఉన్నాయో, ఏ శక్తులు శక్తివంతమైన వెంకయ్యనాయుడిని పక్కకి తప్పించాయో అందరికీ తెలుసు. ఢిల్లీ పాలకుల మెడలు వంచటం తెలుగుదేశానికి కొత్తేం కాదు.


Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *