అవును…సర్కార్ బడులే టార్గెట్

తెలుగుదేశం ప్రభుత్వం పేదలు, బడుగు బలహీన అణగారిన వర్గాలు చదువుకునే ప్రభుత్వ బడులనే లక్ష్యంగా చేసుకుంది. ఏమిటా లక్ష్యం అంటే వాటిని కార్పోరేట్‌ పాఠాశాలలకు దీటుగా తీర్చిదిద్దటమే ఆ లక్ష్యం యొక్క లక్ష్యం. దానికి ఈ వివరాలే సాక్ష్యం. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రచించిన ప్రణాళికలు కార్యరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అనేక పాఠశాల్లో విజయవంతమైన ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు చేరవేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.


ప్రతి పాఠశాలలో వర్చువల్ తరగతులకు శ్రీకారం చుట్టేందుకు రూ.136 కోట్లను ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 4 వేలకు పైగా ఉన్నత పాఠశాలల్లో వర్చువల్ తరగతులు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. గత ప్రభుత్వాలు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి, ఎన్నో పాఠశాలలకు వివిధ విజ్ఞాన అంశాలను పంపించినా, సౌకర్యాలు లేకపోవడం వల్ల, వినియోగించే విధానం తెలియకపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు బూజు పట్టాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతి పాఠశాలలో నూరు శాతం వర్చువల్ తరగతులు జరిగేలా చర్యలు తీసుకునేందుకు సైతం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కార్పొరేట్ విద్యావిధానంలో మార్కులు సాధించే యంత్రాల్లా విద్యార్థులు ఉంటున్నారనే ఉద్దేశంతో, విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం త్వరలో ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు సైతం ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వర్చువల్ తరగతుల ఏర్పాటే కాదు… పిల్లల్లో సామాజిక స్పృహకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, వర్చువల్ తరగతుల ఏర్పాటు సమయంలోనే మెదడుకు పదును పెట్టి, సమాజం పట్ల బాధ్యతను పెంచే మరికొన్ని అంశాలను ఇందులో చేర్చనున్నారు.

విద్యావ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసి, కార్పొరేట్ కళాశాలల జేబులు నింపిన గత ప్రభుత్వాలకు భిన్నంగా, ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పేదవిద్యార్థులు జీవితాల్లో వెలుగులు నింపనుంది. ఇప్పటికే ఆ మధ్య కాలంలో రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా మారుస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది తమ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమని ఆయన చెప్పారు. నేడు ఆంధ్రప్రదేశ్ ఏ విధానం అనుసరిస్తే భవిష్యత్తులో దేశం అదే అనుసరిస్తుందని తాము చెబుతున్న మాటలు నూరుపాళ్లూ వాస్తవమని ముఖ్యమంత్రి తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాలను ప్రీస్కూళ్లుగా తీర్చిదిద్దుతున్న తమ ప్రభుత్వ విధానం దేశానికే ఆదర్శమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రీ స్కూళ్ల వల్ల వేలాది చిన్నారులను ప్రయోజకులను చేసే అవకాశం అంగన్‌వాడీ సిబ్బందికి కలిగిందని ముఖ్యమంత్రి అన్నారు. తరగతి గదిలో గోడలమీద అందమైన తైలవర్ణచిత్రాలు, ఆకర్షించే ఆటవస్తువులు, కుర్చీలు, బల్లలు, ఆహ్లాద వాతావరణం ఉండాలని, ఇందుకోసం ఒక్కో ప్రీస్కూలు సెంటర్ కు ప్రభుత్వం రూ. 2.40 లక్షలు వ్యయం చేస్తున్నదన్నారు.


ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు అధికంగా ఉంటారని వారి కోసం ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యను అందిస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎర్నెట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జనరల్‌ నీనా పహుజ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఐఐటీ ఫౌండేషన్‌తో పాటు రానున్న విద్యా సంవత్సరం నుంచి మెడికల్‌ ఫౌండేషన్‌ కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఒత్తిడితో కూడిన విద్యాబోధన చేస్తున్నారని.. ప్రభుత్వ పాఠశాలల్లో ఒత్తిడిలేని అర్థవంతమైన విద్య అందుతున్నట్లు వివరించారు. డిజిటల్‌ తరగతులపై ఉపాధ్యాయులకు అవగాహన తక్కువగా ఉన్నట్లు గుర్తించామని, మేలో వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో అమలవుతున్న డిజిటల్‌ తరగతుల్లో గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో కేవలం తెలుగు బోధన చేస్తున్నారని..
Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *